AP Inter Practicals: ఇంటర్ పరీక్షల్లో మార్పులు.. ఏ రోజు మార్కులు ఆ రోజే నమోదు.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
ప్రాక్టికల్ పరీక్ష ముగిసిన వెంటనే ఏ రోజు మార్కులను ఆ రోజే ఎగ్జామినర్ కంప్యూటర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు హాజరైన ఎగ్జామినర్ ఫోన్‌కు ఇంటర్ విద్యామండలి ఓటీపీని పంపిస్తుంది. దాని ఆధారంగా కళాశాలలోని కంప్యూటర్ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగాలని మండలి ఆదేశించింది. మాన్యువల్‌గా నమోదు చేయవద్దని తెలిపింది.
ఇంటర్ రెగ్యులర్ కోర్సులకు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. కాగా ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరుగనున్నాయి. ఈ సారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మొత్తం కలిపి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
SSC 10th Class Public Exams 2024: ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!
ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ఇదే..
ఇంటర్ మొదటి సంవత్సరం..
మార్చి 1 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 4 - ఇంగ్లిష్ పేపర్-1
మార్చి 6 - మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1
మార్చి 9 - మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మార్చి 12 - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1
మార్చి 14 - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్ & మ్యూజిక్ పేపర్-1
మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
మార్చి 19 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ ద్వితీయ సంవత్సరం..
మార్చి 2 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మార్చి 5 - ఇంగ్లిష్ పేపర్-2
మార్చి 7 - మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2.
మార్చి 11 - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
మార్చి 13 - ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
మార్చి 15 - కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2
మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
మార్చి 20 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2
Also Read : Model Papers 2024