Skip to main content

Intermediate Public Examinations 2024 : 124 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు

124 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు
124 examination centers set up for first and second-year students in Eluru  DRO M. Venkateswarlu directs armed conduct of intermediate public exams in Eluru Metro   32,445 students to appear in three phases of intermediate exams in Eluru district   Intermediate Public Examinations 2024 - 124 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు
Intermediate Public Examinations 2024 : 124 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు

ఏలూరు (మెట్రో): ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌వో ఎం.వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ జిల్లా కమిటీ సభ్యులు విద్యాశాఖ, పోలీస్‌, విద్యుత్‌, వైద్యశాఖ, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులతో డీఆర్‌ఓ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను మూడు దశలుగా నిర్వహిస్తామని, జిల్లాలో 124 పరీక్షా కేంద్రాల్లో మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన మొత్తం 32,445 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం 15,656, రెండో సంవత్సరం 16,789 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఫిబ్రవరి 2న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయన్నారు.

Also Read : AP Inter 1st Year Study Material (TM)

ఈ పరీక్షలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు (ఒకేషనల్‌), 29 సెంటర్లలో, ఫిబ్రవరి 11 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌) 69 కేంద్రాల్లో రెండు పూటలా నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 1 నుంచి 20 వరకు థియరీ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పరీక్ష సమయానికి కంటే ఒక గంట ముందు చేరుకోవాలన్నారు.

Also Read : AP Inter 2nd Year Study Material

పరీక్ష నిర్వహణ రోజుల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను పరీక్ష వేళలకు అనువుగా రీషెడ్యూల్‌ చేసి నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీ ములను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీవీఈఓ, కన్వీనర్‌ డీఈసీ బి.ప్రభాకరరావు, అడిషనల్‌ ఎస్పీ ఎన్‌ఎస్‌ఆర్‌ శేఖర్‌, డీఎస్పీ చంద్రశేఖర్‌, డీపీవో టి.శ్రీనివాస విశ్వనాధ్‌, డీఈఓ శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.

Published date : 02 Feb 2024 10:04AM

Photo Stories