TS ICET 2022 Results Link : నేడే టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్ నిర్వహించింది. ఈ ఐసెట్ పరీక్షను జూలై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించిన విషయం తెల్సిందే. తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 4 మొత్తంగా 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి.. 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 75 మంది అబ్జర్వర్లను నియమించి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 75,958 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు.
టీఎస్ ఐసెట్-2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి
TS ICET -2022 Results (Click Here )
How to check TS ICET Results 2022?
- Visit https://results.sakshieducation.com or education.sakshi.com
- Click on TS ICET Results 2022 link on the home page
- In the next page, enter your hallticket number and click on submit
- Your results will be displayed
- Save a copy of the results for further reference.
Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!
ఈ ఏడాది ఐసెట్‌లో కీలక మార్పులు..
ఈ ఏడాది టీఎస్ ఐసెట్‌లో కీలక మార్పులు చేశారు. మూడు విభాగాలుగా నిర్వహించే ఈ పరీక్షలో.. రెండో విభాగం(పార్ట్–బి)లో ఆల్‌జీబ్రకల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీలోని కొన్ని అంశాలను, అదే విధంగా స్టాటిస్టికల్ ఎబిలిటీలోని పలు అంశాలను తొలగించారు. ముఖ్యంగా స్టాటిస్టికల్ ఎబిలిటీలో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కొరెలేషన్ టాపిక్స్ తొలగించారు. ఇది ఏదైనా డిగ్రీ అర్హతగా నిర్వహించే ఐసెట్‌లో..నాన్–మ్యాథ్స్ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
TS ICET 2020 College Predictor
అంశాల వారీగా మార్కులు ఇలా..
ఈ ఏడాది ఐసెట్ నోటిఫికేషన్ సమయంలోనే.. పరీక్ష విభాగాలు.. ఆయా విభాగాలకు కేటాయించిన మార్కులు.. సదరు విభాగాల నుంచి అడిగే అంశాలు–వాటికి కేటాయించిన మార్కులను కూడా ముందుగానే ప్రకటించారు. దీని ఫలితంగా అభ్యర్థులు ఆయా అంశాలకు కేటాయించిన మార్కులను బట్టి, వాటికి పరీక్షలో లభించే వెయిటేజీని గుర్తించి.. ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించేందుకు అవకాశం లభించింది. తమకు పట్టున్న విభాగాలకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా అందులో మరిన్ని ఎక్కువ మార్కులు సొంతం చేసుకునేలా సన్నద్ధమయ్యే అవకాశం ఈ సారి కూడా లభించింది.