Skip to main content

ఈ క్యాట్ అందరిదీ !

దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 25న ఈ పరీక్షను నిర్వహిస్తామని.. ఈ ఏడాది క్యాట్ నిర్వాహక సంస్థ ఐఐఎం-కోల్‌కతా ప్రకటించింది. అంతేకాకుండా.. గతేడాది క్యాట్ ఫలితాలను పరిశీలించి.. విశ్లేషించి.. వాటి ఆధారంగా మార్పుచేర్పుల విషయంపైనిర్ణయం తీసుకుంటామని క్యాట్-2018 కన్వీనర్ ప్రొఫెసర్ సుమంత బసు పేర్కొన్నారు. ఇంకా పరీక్షకు సంబంధించి వివిధ అంశాలను ఆయన ప్రత్యేకంగా ‘సాక్షి’తో పంచుకున్నారు.
కామన్ అడ్మిషన్ టెస్ట్-2018 తేదీని ముందుగా ప్రకటించడంలో ప్రధాన ఉద్దే శం.. అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడమే. ముందుగా తేదీ ప్రక టించడం వల్ల అభ్యర్థులు పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు వేచి చూడకుండా... ప్రిపరేషన్ ప్రారంభించడానికి వీలవుతుంది. క్యాట్-2018 పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఆగస్టు రెండో వారం లేదా మూడో వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

మార్పులు, చేర్పులు...
క్యాట్ పరీక్ష విధానంలో ఈ ఏడాది మార్పులు జరిగే అవకాముందని పేర్కొన్న మాట వాస్తవమే. ఇందుకోసం గతేడాది క్యాట్ ఫలితాలను విశ్లేషించాలని భావిస్తున్నాం. అందులో ఆయా విభాగాల వారీగా అభ్యర్థులు చూపిన ప్రతిభ, మొత్తంగా చూపిన ప్రదర్శన, ఎంపికైన విద్యార్థుల అకడమిక్ నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోనున్నాం. ఈ విశ్లేషణ తర్వాత క్యాట్-2018లో మా ర్పులు చేయాలా? వద్దా? అనే విషయంపై స్పష్టత వస్తుంది.

నిపుణుల కమిటీ :
క్యాట్-2018లో మార్పులు, పరీక్ష విధానంపై నిపుణుల కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీ క్యాట్ పరీక్ష తీరుతెన్నులను పరిశీలించి తుది నిర్ణయం తెలియజేస్తుంది. దీని ఆధారంగా క్యాట్-2018 పరీక్ష విధానాన్ని ఖరారు చేస్తాం. ఈ కసరత్తు మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. మొత్తం మీద మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించేందుకు తగిన అర్హతలున్న అభ్యర్థులను ఎంపిక చేసేలా క్యాట్ విధానం ఉంటుందని చెప్పగలను.

అన్ని నేపథ్యాలకూ అనుకూలం :
క్యాట్ పరీక్ష ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికే అనుకూలమనే అభిప్రాయం సరికాదు. టాపర్స్‌గా నిలిచిన అభ్యర్థులంతా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారే కావడంతో ఇలాంటి అపోహ నెలకొంటోంది. క్యాట్ పరీక్ష విధానం అకడమిక్‌గా అన్ని నేపథ్యాల విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఫలితంగా ఐఐఎంలలో ప్రవేశాల పరంగా విభిన్న వర్గాల వారికి అవకాశం లభిస్తుంది. వాస్తవానికి మొత్తంగా ఐఐఎంలలో ప్రవేశాల కోణంలో అభ్యర్థుల అకడమిక్ నేపథ్యాలను పరిశీలిస్తే ఆర్ట్స్, కామర్స్ తదితర నాన్-టెక్నికల్ కోర్సుల నేపథ్యం ఉన్న అభ్యర్థుల సంఖ్య 40 శాతం వరకు ఉంటోంది.

లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ :
ప్రవేశాల పరంగా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ విధానానికి కట్టుబడే విధంగా.. ఐఐఎంలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రవేశాల కోణంలో కేవలం క్యాట్ స్కోర్‌కే పరిమితం కాకుండా.. జండర్, కల్చరల్, జియోగ్రాఫికల్, అకడమిక్ డైవర్సిటీ వంటి అంశాలకు నిర్దిష్ట వెయిటేజీ ఇస్తున్నాం. ఫలి తంగా ఇటీవలకాలంలో అన్ని వర్గాల అభ్యర్థులు ఐఐఎంలలో కనిపిస్తున్నారు.

అపోహలతోనే దూరంగా...
అన్ని వర్గాల అభ్యర్థులకు ప్రయోజనం కలిగించేలా ఐఐఎంలు విధానాలు రూపొందిస్తున్న ప్పటికీ.. వాటిలో ప్రవేశానికి నిర్దేశించిన క్యాట్ విషయంలో నెలకొన్న అపోహలతోనే ప్రతిభావం తులైన అభ్యర్థులు కూడా పరీక్షకు దరఖాస్తు చేయడానికి సైతం వెనకాడుతున్నారు. ఈ పరిస్థితి కూడా క్యాట్‌లో ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేప థ్యమున్న అభ్యర్థుల విజయ శాతం ఎక్కువగా ఉండటానికి కారణం. కానీ, పరీక్ష విధానంపై ముందస్తుగానే అవగాహన పొందితే అన్ని నేపథ్యాల అభ్యర్థులు క్యాట్‌లో మెరుగ్గా రాణించే అవకాశ ముంది.

ఆ మూడు లక్షణాలతో ముందుకు సాగాలి...
క్యాట్‌లో మంచి స్కోర్ సాధించడానికి విద్యార్థులు... మూడు లక్షణాలతో ముందుకు సాగాలి. అవి.. హార్డ్‌వర్క్, అంకిత భావం, పట్టుదల. ఈ మూడు లక్షణాలు ఉంటే క్యాట్ ‘క్లిష్టం’ అనే భావనకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు. తద్వారా పరీక్షలో మెరుగ్గా రాణించేలా ముందుకు సాగే అవకాశం లభిస్తుంది. మేనేజ్‌మెంట్ ఔత్సాహిక విద్యార్థులకు ఇచ్చే సలహా ఏమంటే... క్యాట్‌లో విజయం సాధించి.. ఐఐఎంలో అడుగుపెట్టడంతోనే లక్ష్యం పూర్తయిందని భావించొద్దు. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ నిపుణులుగా రాణించాంటే.. నిరంతర కృషి, అధ్యయనం ఎంతో అవసరం. కాబట్టి లక్ష్యా నికి అనుగుణంగా ఐఐఎంలో అడుగుపెట్టిన నాటి నుంచే కృషిచేయాలి.
Published date : 27 Jul 2018 12:27PM

Photo Stories