అద్భుత అవకాశాల హాస్పిటాలిటీ..
Sakshi Education
హాస్పిటాలిటీ... రోజురోజుకూ ప్రాధాన్యం సంతరించుకుంటున్న రంగం! కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో సుందర ప్రదేశాలకు నిలయమైన భారత్.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దాంతో హాస్పిటాలిటీ రంగం వేగంగా విస్తరిస్తూ.. యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. దేశంలో హాస్పిటాలిటీ రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ‘హాస్పిటాలిటీ కోర్సులను పూర్తిచేసిన వారికి అద్భుత అవకాశాలు సొంతమవుతాయి’ అంటున్నారు.. ‘డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్’డెరైక్టర్ పి.నారాయణ రెడ్డి. ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ..
టూరిజం, హాస్పిటాలిటీ:
వాస్తవానికి హాస్పిటాలిటీ(ఆతిథ్య).. ఒక ప్రత్యేకమైన రంగం కాదు. ఇది టూరిజం, హోటల్ పరిశ్రమ సమ్మిళితంగా ఉంటుంది. హాస్పిటాలిటీ అంటే.. ఆతిథ్యం అని అర్థం. పర్యాటకులకు, హోటల్స్‌లో విడిది చేసే వారికి సంతృప్తికరంగా సేవలందించడమే చక్కటి ఆతిథ్యం. రెండింటి సమ్మేళనం కాబట్టే దీన్ని టూరిజం అండ్ హాస్పిటాలిటీగా పేర్కొనాలి. దేశంలో హాస్పిటాలిటీ రంగం ప్రగతిని పరిశీలిస్తే.. ఏటేటా గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. ప్రతిఏటా సగటున పది శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. మిగతా రంగాలు సాధిస్తున్న వృద్ధి కంటే ఇది ఎక్కువే. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగ ప్రాధాన్యతను గుర్తించి.. దీని అభివృద్ధి దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలైతే వినూత్న వ్యూహాలు (మెడికల్ టూరిజం, రూరల్ టూరిజం తదితర) అనుసరిస్తూ.. పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఉపాధికల్పనలో రెండో స్థానం:
మనది వ్యవసాయ ఆధారిత దేశం. కాబట్టి ఉపాధి పరంగా వ్యవసాయ రంగానిదే మొదటి స్థానం. ఇప్పుడు వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పనలో టూరిజం, హాస్పిటాలిటీ రంగం రెండో స్థానంలో నిలుస్తుండటం విశేషం. దీన్నిబట్టి చూస్తే.. హాస్పిటాలిటీ రంగంలో సుశిక్షితులైతే ఉపాధికి కొదవ లేదనేది నిస్సందేహం. అయితే పర్యాటక రంగం ఇప్పటికీ అసంఘటిత రంగంగా ఉండటం కొంత ప్రతికూలాంశం. దీన్ని సంఘటిత రంగంగా గుర్తిస్తే మరింత ప్రగతి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సుల పట్ల అప్రమత్తంగా:
ఈ రంగంలో మానవ వనరులకు పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయివేట్ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్న కోర్సుల పట్ల ఔత్సాహిక విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. సదరు ఇన్‌స్టిట్యూట్‌లకు ఉన్న గుర్తింపు, మౌలిక సదుపాయాలు, చేరాలనుకుంటున్న కోర్సుకు సంబంధించి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు కల్పించే సౌకర్యాలపై ఆరా తీసి.. అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే చేరాలి. లేదంటే.. ఎంతో విలువైన సమయాన్ని, డబ్బును నష్టపోతారు. ప్రస్తుతం ఈ రంగంలో ఎన్నో స్వల్పకాలిక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఆయా కోర్సుల్లో ఒక స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌గా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ను అందిస్తున్నాయి. వీటివల్ల విద్యార్థులకు లభించే నైపుణ్యం అరకొరగానే ఉంటుంది. పరిశ్రమ అవసరాలకు సరిపడ స్కిల్స్ సొంతం కావు. అయితే, డాక్టర్ వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, మరికొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు అందించే స్వల్పకాలిక కోర్సుల్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో బోధన సాగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలో ఆందోళన చెందక్కర్లేదు.
కోర్సులకు పెరుగుతున్న డిమాండ్:
టూరిజం, హాస్పిటాలిటీ రంగానికి పెరుగుతున్న ఆదరణ.. మానవ వనరుల విషయంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేల సంఖ్యలో ఉన్న విషయాన్ని గుర్తించిన పలు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు.. పలు హాస్పిటాలిటీ కోర్సులకు రూపకల్పన చేసి అందిస్తున్నాయి. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ దేశవ్యాప్తంగా హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లను నెలకొల్పి బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులను అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రతి ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ.. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)ని నిర్వహిస్తోంది. ఇలా కేంద్ర ప్రభుత్వం మొదలు.. అనేక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌ల వరకూ ఎన్నో కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి.
అపోహ వీడితే.. అవకాశాలు అనేకం:
నేటి యువత ఇంజనీరింగ్, ఎంబీబీఎస్‌లతోనే భవిష్యత్తు అనే భావనలో ఉన్నారు. హాస్పిటాలిటీ అంటే.. కుకింగ్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి విధులుంటాయి అనే అపోహ కారణంగా ఈ కోర్సుల పట్ల ఆదరణ తక్కువగా ఉంది. అయితే, ఇవి కోర్సులో ఒక భాగం మాత్రమే. కాబట్టి విద్యార్థులు ఇలాంటి అపోహ వీడి, హాస్పిటాలిటీలో అనేక అవకాశాలుంటాయని గుర్తించాలి. టూర్ ఆపరేటర్స్, ఏజెంట్స్, గైడ్స్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ వంటి పలు హోదాలు లభిస్తాయి. అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలు ప్రధానంగా పర్యాటక రంగంలో సొంతంగా ట్రావెల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా పలు అంతర్జాతీయ సంస్థల్లోనూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెన్సీల్లోనూ అవకాశాలు అనేకం.
అనుభవంతో ఆదాయం.. అపారం:
హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులను.. సంస్థలు ఒక ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పేరిట నియమించుకుంటాయి. ఈ సమయంలో ఆయా కోర్సుల ఆధారంగా రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు నెల వేతనం లభిస్తుంది. ప్రారంభంలో తక్కువ వేతనాలు వస్తాయని భావించక్కర్లేదు. ఇది ఆయా సంస్థల విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్ల అనుభవం గడిస్తే ఆదాయానికి ఆకాశమే హద్దు. ఎన్‌ఐటీహెచ్‌ఎంకు చెందిన ఒక విద్యార్థినిని హాస్పిటాలిటీ ఆఫీసర్‌గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ రూ.48 వేల వేతనంతో నియమించుకుంది. కాబట్టి విద్యార్థులు ప్రారంభ వేతనం గురించి ఆలోచించకుండా ఆఫర్ ఇచ్చిన సంస్థ ప్రాధాన్యతను గుర్తిస్తే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. ఈ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులకు 24×7 వాతావరణంలో పనిచేసే సహజ లక్షణం ఉండాలి. అప్పుడే ఆశించిన స్థాయికంటే ఉన్నత హోదాలు అందుకోగలరు. దాంతోపాటు సృజనాత్మకత, సహనం, ఓర్పు, ఇతరులను మెప్పించే నేర్పు ఉంటే చక్కగా రాణించగల రంగం హాస్పిటాలిటీ.
వైవిధ్యానికి కేరాఫ్:
అక్టోబర్ 2004లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. అతికొద్ది కాలంలోనే అకడమిక్ పరంగా ఈ రంగంలో వైవిధ్యానికి, వినూత్నతకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో హాస్పిటాలిటీలో ఎంబీఏ, బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. హాస్పిటాలిటీలో టూరిజం, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అనుసంధానం చేస్తూ కోర్సులు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ఎన్‌ఐటీహెచ్‌ఎం మాత్రమే. ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్, సీమ్యాట్, మ్యాట్ స్కోర్‌లను ప్రామాణికంగా తీసుకుంటాం. బీబీఏ కోర్సుకు మాత్రం ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించి కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాం. దీంతోపాటు తాజాగా బీఎస్సీ(హోటల్ మేనేజ్‌మెంట్) కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నాం. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ నిర్వహించే జేఈఈలో ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ఫీజు విషయంలో విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించే విధంగా ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకుని ట్యూషన్ ఫీజు, ల్యాప్‌టాప్ తదితర అకడమిక్ అవసరాలకు కావల్సిన మొత్తాన్ని పొందే విధంగా విద్యార్థులకు సహకరిస్తున్నాం.. పైన పేర్కొన్న కోర్సులతోపాటు పదో తరగతి అర్హతగా మూడు నెలలు, ఆరు నెలల వ్యవధిలో సాగే రూరల్ టూరిజం, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఆర్ట్ అప్రిసియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఆయుర్వేద పంచకర్మ వంటి స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులను జూలైలో మొదలుపెట్టాం. అదే విధంగా క్రూయిజ్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, మెడికల్ టూరిజం వంటి కోర్సులను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నాం. వీటితోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కేటగిరీలో రెండు నెలల వ్యవధిలో ఫుడ్ ప్రొడక్షన్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాం. వీటికి వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తాం.
పూర్తి స్థాయిలో ప్లేస్‌మెంట్ సహకారం:
ఎంబీఏ నుంచి ఆయుర్వేద పంచకర్మ వరకు ఏ స్థాయి కోర్సయినా.. దాని వ్యవధితో నిమిత్తం లేకుండా కోర్సు ఉత్తీర్ణులైన వారికి ఉపాధి లభించేవిధంగా సహకారాన్ని అందిస్తున్నాం. ప్రతి ఏటా బీబీఏ, ఎంబీఏలో మూడు సెమిస్టర్‌లు పూర్తయిన వెంటనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ దిశగా ఏర్పాట్లు జరుగుతాయి. ఇలా ఎన్‌ఐటీహెచ్‌ఎం నుంచి ఇప్పటివరకు వందల సంఖ్యలో విద్యార్థులు పలు సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ఏపీటీడీసీ, జీఎంఆర్, రాడిసన్, గ్రీన్‌పార్క్, థామస్‌కుక్ వంటి సంస్థల్లో పలు హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
పలు సంస్థలతో ఒప్పందాలు:
డాక్టర్ వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎం.. అటు అకడమిక్‌గా.. ఇటు ఇండస్ట్రీ పరంగా విద్యార్థులకు మేలుచేసేలా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎంబీఏ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించి.. జేఎన్‌టీయూ-హెచ్‌తో ఒప్పందం చేసుకున్నాం. అదేవిధంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ నిర్వహణ కోసం హిల్టన్ యూనివర్సిటీతోనూ ఒప్పందం జరిగింది. ఇక ఇండస్ట్రీ పరంగా ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అసోసియేషన్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ తదితర సంస్థలతో ఎంఓయూలు జరిగాయి. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని ‘హరిత’ హోటళ్లలో పనిచేసే సిబ్బందికి శాస్త్రీయ పద్ధతుల్లో నైపుణ్యం లభించే విధంగా హౌస్ కీపింగ్‌లోనూ శిక్షణనందిస్తున్నాం. ఈ శిక్షణకు హరిత హోటల్స్ సిబ్బందితోపాటు ఇతర హోటల్స్‌లో పనిచేసే వాళ్లు కూడా అర్హులే. అయితే, 8వ తరగతి పూర్తి చేసి, 28 ఏళ్లలోపు వయసు వారై ఉండాలి. ఎన్‌ఐటీహెచ్‌ఎం ప్రస్థానంలో అత్యంత ప్రముఖమైన అంశం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో 200 గదులు, పది డీలక్స్ సూట్స్ సామర్థ్యం ఉండే స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. ప్రఖ్యాత హిల్టన్ గ్రూప్‌తో ‘పీపీపీ’ ఒప్పందం ద్వారా ఈ హోటల్ నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాది మే నాటికి నిర్మాణం పూర్తయి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

Published date : 18 Jul 2013 04:03PM