Skip to main content

Toppers: ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత

TS ICET 2021 results
TS ICET 2021 results
  • ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి 

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌–21 ఫలితాలు సెప్టెంబ‌ర్  23న విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్‌, టీఎస్‌ఐసెట్‌ చైర్మన్‌ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజి్రస్టేషన్‌ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌.లోకేష్‌ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌ టి.పాపిరెడ్డి, కేయూ రిజి్రస్టార్‌ బి.వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


టీఎస్‌ఐసెట్‌లో టాప్‌–20 ర్యాంకర్ల వివరాలు ఇలా.. 

ర్యాంక్‌ పేరు మార్కులు జిల్లా
1 ఆర్‌. లోకేష్‌ 155.36716 హైదరాబాద్‌
2 పామడి సాయి తనూజా 155.00341 హైదరాబాద్‌
3 ఆర్‌. నవీనాక్షంత 151.22706 మేడ్చల్‌
4 తుమ్మ రాజశేఖరచక్రవర్తి 151 12868 మేడ్చల్‌
5 పొట్ల ఆనంద్‌పాల్‌ 149.94369 కృష్ణా, ఏపీ
6 బెల్లు శ్రీచరిత 147.52870 నల్లగొండ
7 ఆనెమ్‌ అఖిల్‌ 146,20764 మేడ్చల్‌
8 కల్వకుంట మిథిలేష్‌ 145.61310 జగిత్యాల
9 కాత్యాయనా నిఖితాఐశ్వర్య 144.309.09 రంగారెడ్డి
10 అరుణ్‌కుమార్‌ బత్తుల 143,88972 వరంగల్‌
11 శ్రీరామోజు స్ఫూర్తి 143,24829 రంగారెడ్డి
12 మహ్మద్‌నదీన్‌ ఖాన్‌ 141.09795 కరీంనగర్‌
13 అర్వలక్ష్మి జాహ్నవి 140.99397 తూ.గోదావరి(ఏపీ)
14 పొద్దుటూరి అశిష్‌ 140.97539 హైదరాబాద్‌
15 కామిశెట్టి సూర్యతేజ 140.09355 కొత్తగూడెం
16 వినీల్‌రెడ్డి 140.06698 కర్నూల్‌(ఏపీ)
17 నిఖిల్‌ బమ్మిడిపాటి 139.99461 హైదరాబాద్‌
18 అదిత్య వర్ధన్‌ గుండ్ల 139.37602 హైదరాబాద్‌
19 కన్హాయా బియాని 138.81407 హైదరాబాద్‌
20 యూ. ధ్రువకుమార్‌రెడ్డి 137.50799 వైఎస్సార్‌(ఏపీ)

 

ఐఏఎస్‌ కావాలనేది లక్ష్యం..lokesh
నేను ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంగా సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్నా. టీఎస్‌ఐసెట్‌ను సివిల్స్‌ ప్రిపరేషన్‌లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్‌ ఈసీఈ పూర్తిచేశాను.     
– ఆర్‌.లోకేష్, మొదటి ర్యాంకర్‌ 

బ్యాంకు మేనేజర్‌ కావాలనేది లక్ష్యం.. sai tanuja
నేను బీటెక్‌ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్‌ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్‌ఐసెట్‌ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా.     
– పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్‌ 

ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌లో చేరుతా..naveenakshitha
నేను గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్‌లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరతాను.
    – నవీనాక్షంత, మూడో ర్యాంకర్‌ 

Published date : 24 Sep 2021 04:01PM

Photo Stories