APPSC Group 1 Ranker Success Story : పంచాయతీ కార్యదర్శి నుంచి గ్రూప్-1 అధికారిగా.. రాణించానిలా..
ఈ నేపథ్యంలో గ్రూప్–1లో ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ట్రెజరరీ అధికారిగా ఎంపికైన అనిల్ సక్సెస్ స్టోరీ మీకోసం..
APPSC Group-1 Ranker Bharath Nayak Success Story : భరత్ అనే నేను.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..
పంచాయతీ కార్యదర్శి నుంచి గ్రూప్-1 అధికారిగా..
సోమందేపల్లి మండలం జూలకుంట సచివాలయ కార్యదర్శి అనిల్ గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటారు. అసిస్టెంట్ ట్రెజరరీ అధికారిగా ఎంపికయ్యారు. ఈయన స్వస్థలం రొద్దం మండలం చోళేమర్రి. తల్లిదండ్రులు సుబ్బరాయప్ప, పార్వతమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. కుమారుడిని కష్టపడి చదివించారు. 2014లో అనిల్ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. అనంతరం గ్రూప్–1కు ప్రిపేరై విజయం సాధించాడు. ఈయన భార్య నీరజ సోమందేపల్లి మండలం కేతగానిచెరువు సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కరోనా తరువాత..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలను ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్ విధానంలో చేశారు. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.