Physics Study Material for Groups Exam : గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా.. ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు?
ధ్వని
ధ్వని అభిలక్షణాలు
ధ్వనికి ప్రధానంగా 3 రకాల అభిలక్షణాలు ఉంటాయి. అవి.. 1. పిచ్ లేదా కీచుదనం 2. తీవ్రత
3. నాదగుణం లేదా నాణ్యత
1. పిచ్ లేదా కీచుదనం: కీచుస్వరం, బొంగురుస్వరాల మధ్య ఉండే లక్షణమే కీచుదనం.
➦ ఇది పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది.
➦ ఈ లక్షణాన్ని హెర్ట్జ్(ఏ్డ) ప్రమాణంతో
కొలుస్తారు.
➦ ధ్వని కీచుదనం కొలవడానికి వాడే పరికరం టోనోమీటర్.
పిచ్ లేదా కీచుదనం ఉండే జీవులు:
1) దోమలు 2) చిన్నపిల్లలు
3) మహిళలు 4) తుమ్మెద
➦ మహిళల స్వరానికి పురుషుల స్వరం కంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది.➦ శృతిదండం పిచ్ దాని భుజాలపై ఆధారపడి ఉంటుంది.
Sainik School Recruitment 2024: సైనిక్ స్కూల్ కోరుకొండ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024: దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
2. తీవ్రత: ఇది కంపనపరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఈ లక్షణాన్ని ఛీఆ(డెసిబెల్)
ప్రమా ణంతో కొలుస్తారు.
➦ ధ్వని తీవ్రత కొలవడానికి వాడే పరికరం సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్.
తీవ్రత ఉండే జీవులు:
1) పురుషులు 2) సింహం 3) ఏనుగు
➦ 80ఛీఆ కంటే ఎక్కువ తీవ్రత ఉండే ధ్వనుల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
➦ విమానాశ్రయాల సమీపంలో పని చేసే ప్రజలు ఇయర్‌ప్లగ్స్‌ను ఉపయోగించి తమ చెవులు కా΄ాడుకోవాలి.
3. నాదగుణం: ధ్వనుల్లో ఉండే వ్యత్యాసాన్ని గుర్తించే స్వభావాన్ని నాదగుణం అంటారు.
ఉదా: వాహనాన్ని చూడకుండా దాని నుంచి వచ్చే ధ్వని ఆధారంగా వాహనాన్ని గుర్తించవచ్చు.
➦ ఇది వ్యక్తికి ఉండే శృతి గ్రాహ్యతపై ఆధారపడి ఉంటుంది.
ధ్వని ముద్రణ, పునరుత్పత్తి: పాల్సన్ మొదటిసారి స్టీల్ పలకలపై ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పాదన చేశారు. ఈ పద్ధతిలో ధ్వని తీవ్రత, స్పష్టత చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది ్ర΄ాచుర్యం ΄÷ందలేక΄ోయింది.
➦ టేప్ రికార్డర్‌లో ఉండే ప్లాస్టిక్ టేప్‌పై ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్‌తో పూతపూసి ధ్వనిశక్తిని అయస్కాంతశక్తి రూపంలో నిల్వ చేస్తారు.
Master of Engineering Admissions : సీఐటీడీలో ఇంజనీరింగ్ కోర్సులు.. ప్రవేశానికి దరఖాస్తులు ఇలా..
➦ టేప్‌రికార్డర్ ఆవిష్కర్త: పాల్సన్.
➦ థామస్ ఆల్వా ఎడిసన్ గ్రామ్‌ఫోన్ ప్లేట్లపై ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేశారు. ఈ పద్ధతిలో పునరుత్పత్తి చేసిన∙ధ్వని తీవ్రత, స్పష్టత అధికం.
➦ ఆధునిక కాలంలో సి.డి., డి.వి.డి.లలో ధ్వని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసే ప్రక్రియలో లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు.
➦ సి.డి.ని ఆవిష్కరించింది: సోనీ, ఫిలిప్స్
➦ సినిమా రీల్‌లో ధ్వనిని రికార్డ్ చేసి, పునరుత్పాదన చేసేందుకు ‘కాంతి విద్యుత్ ఫలితం’ ఉపయోగిస్తారు.
కాంతి విద్యుత్ ఫలితం
కాంతి కిరణాలు క్షారలోహ పలకల ఉపరితలంపై పతనం చెందినప్పుడు అవి ఎలక్ట్రాన్లను ఉద్గారం చేయడం వల్ల వలయంలో విద్యుత్ ప్రసారం జరుగుతుంది. దీన్ని కాంతి విద్యుత్
ఫలితం అంటారు.
➦ కాంతి విద్యుత్ ఫలితాన్ని హెన్రిచ్ రుడాల్ఫ్ హెర్ట్జ్ కనుగొన్నాడు. ఇతడు రేడియో,టెలిఫోన్, టీవీ, టెలిగ్రాఫ్‌ల అభివృద్ధికి పునాది వేశారు. ఇతడి సేవలకు గుర్తింపుగా ΄ûనపున్యానికి ప్రమాణం ‘హెర్ట్జ్’ అని నామకరణం చేశారు.
➦ కాంతి విద్యుత్ ఫలితాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వివరించారు.
➦ ఆడియోగ్రాఫ్: ధ్వనిని రికార్డింగ్ చేయడం.
➦ వీడియోగ్రాఫ్: కాంతిని రికార్డింగ్ చేయడం.
Ph D Admissions : ట్రిపుల్‌ఐటీడీఎంలో ఫుల్‌టైం పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
ధ్వని వెలువడే సందర్భం |
ధ్వని తీవ్రత (dBలలో) |
కనురెప్పలు కదిలినప్పుడు | 0 |
గుసగుసలాడినప్పుడు | 15–20 |
గోడ గడియారంలో లోలకం కదిలినప్పుడు | 30 |
సాధారణ సంభాషణ | 50–60 |
టెలిఫోన్ రింగ్ | 60 |
చెవికి ప్రమాదకరమైన ధ్వని | 85 |
ట్రాఫిక్ నుంచి విడుదలయ్యే ధ్వని | 80–90 |
చెవిపోటుకి కారణమయ్యే ధ్వని | 120 |
ఉరుములు ఉరిమినప్పుడు | 150 |
జీఎస్‌ఎల్‌వీ నుంచి విడుదలయ్యే ధ్వని | 250 |
పరికరం కనుగొన్నవారు |
ల్యాండ్‌లైన్ ఫోన్ | అలెగ్జాండర్ గ్రహంబెల్ |
హైడ్రోఫోన్ | ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ |
కంప్యూటర్ | చార్లెస్ బబేజ్ (కంప్యూటర్ పితామహుడు) |
డైనమో | మైఖేల్ ఫారడే |
ఎలక్ట్రిక్ బల్బ్ | థామస్ ఆల్వా ఎడిసన్ |
ఆప్టికల్ ఫైబర్ | నరేంద్రసింగ్ కపానీ |
విమానం | రైట్ బ్రదర్స్ |
హెలికాప్టర్ | బ్రాకెట్ |
న్యూక్లియర్ రియాక్టర్ | ఫెర్మి |
రేడియో | మార్కొని |
టెలివిజన్ | జె.ఎల్. బయర్డ్ |
మొబైల్ ఫోన్ | మార్టిన్ కూపర్ |
క్యాలిక్యులేటర్ | పాస్కల్ |
Shikhar Dhawan: సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్
లిఫ్ట్ | ఓటీస్ |
టెలిస్కోప్ | గెలీలియో |
థర్మామీటర్ | గెలీలియో |
భారమితి | టారిసెల్లీ |
లైటనింగ్ డిటెక్టర్ | బెంజిమన్ ఫ్రాంక్లిన్ |
అణుబాంబు | ఓపెన్ హైమర్ |
హైడ్రోజన్ బాంబ్ | ఎడ్వర్డ్ టెల్లర్ |
థర్మాస్ ఫ్లాస్క్ | డివేర్ |
సైకిల్ | మెక్‌మిలన్ |
బాల్ పెన్ | జేజే బాండ్ |
ఫౌంటెన్ పెన్ | వాటర్ మాన్ |
పెట్రోల్ కారు | కార్ల్ బెంజ్ |
రైల్ ఇంజన్ | స్టీవెన్‌సన్ |
జలాంతర్గామి | బుష్‌నెల్ |
ఎయిర్ కండిషనర్ | కారియర్ |
సేఫ్టీ రేజర్ | జిల్లెట్ |
రాడార్ | వాట్సన్ |
Modi Visit European: రెండు రోజులు పోలెండ్‌లో పర్యటించిన మోదీ.. వినూత్న విదేశాంగ విధానం
గతంలో అడిగిన ప్రశ్నలు
1. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది? (A.DTWO-2012)
ఎ) తరంగదైర్ఘ్యం బి) పౌనపున్యం
సి) డోలనపరిమితి డి) అతిస్వరం
2. డెసిబెల్ దేనికి ప్రమాణం? (Asst, Director-2012)
ఎ) విద్యుత్ బి) కాంతి
సి) ఉష్ణం డి) శబ్దం
3. టెలిఫోన్ ఆవిష్కర్త? (Telugu Translater-2010)
ఎ) ఆల్ఫ్రెడ్ నోబెల్
బి) అలెగ్జాండర్ గ్రాహంబెల్
సి) ఎడిసన్
డి) డార్విన్
4. రాడార్‌ను కనుగొన్నవారు? (Jr.Asst-2012)
ఎ) వాట్సన్ బి) ఫ్లెమింగ్
సి) బుష్‌నెల్ డి) ఆస్టన్
5. టేప్‌రికార్డర్‌ను కనుగొన్నవారు? (Observer Engineer-2013)
ఎ) పాల్సన్ బి) హారిసన్
సి) ఫోకాల్ట్ డి) డావీ
6. సేఫ్టీ రేజర్ కనుగొన్నవారు? (Observer Engineer-2013)
ఎ) బెర్లిన్ బి) హారిసన్
సి) జిల్లెట్ డి) పాల్సన్
7. రేడియోను కనుగొన్నవారు? (Research Asst. Engineer-2013)
ఎ) గ్రాహంబెల్ బి) మార్కొని
సి) న్యూటన్ డి) అట్టోహన్
8. లిఫ్ట్‌ని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు? (Jr. Asst.-2012)
ఎ) ఫారడే, 1851
బి) ఓటీస్, 1852
సి) ఎడిసన్, 1878
డి) జె.ఎల్.బయర్డ్, 1926
9. వైర్‌లెస్ టెలిగ్రఫీని కనుగొన్నదెవరు? (ASWO-2012)
ఎ) మార్కొని బి) మాక్స్‌వెల్
సి) మాక్స్ ప్లాంక్ డి) స్టీవెన్‌సన్
10. రైలింజన్ ఆవిష్కర్త ఎవరు? (ASWO-2012)
ఎ) థామ్సన్ బి) అండర్‌సన్
సి) బెర్లిన్ డి) స్టీవెన్‌సన్
11. రైట్ సోదరులు దేన్ని కనుగొన్నారు? (Jr. Asst.-2012)
ఎ) టెలిస్కోప్ బి) రేడియో
సి) హెలికాఫ్టర్ డి) విమానం
12. జలాంతర్గామి ఆవిష్కర్త ఎవరు? (Jr.Asst-2012)
ఎ) గేటింగ్ బి) జిల్లెట్
సి) కాక్స్‌టన్ డి) బుష్‌నెల్
13. పెట్రోల్ కారు ఆవిష్కర్త ఎవరు? (Jr.Asst-2012)
ఎ) కార్ల్‌బెంజ్ బి) ఫ్రాంక్లిన్
సి) హారిసన్ డి) కేరియర్
14. ఆడియో టేపులను దేనితో పూతపూస్తారు? (Group II -2012)
ఎ) అల్యూమినియం ఆక్సైడ్
బి) సిల్వర్ అయోడైడ్
సి) ఫెర్రిక్ ఆక్సైడ్
డి) పొటాషియం నైట్రేట్
15. హెలికాప్టర్ కనుగొన్నది ఎవరు? (Jr.Asst-2012)
ఎ) ఎడిసన్ బి) బ్రాన్సీ
సి) లారెన్స్ డి) బ్రాకెట్
16. ఎయిర్ కండిషనర్ కనుగొన్నవారు? (Tech.Asst-2012)
ఎ) కారియర్ బి) హారిసన్
సి) డేనిష్ మెల్‌రోజ్ డి) ఫెర్మి
17. క్యాలిక్యులేటర్ కనుగొన్నవారు? (Jr.Steno-2012)
ఎ) రాబర్ట్ మాలెట్ బి) గోబర్
సి) పాస్కల్ డి) పాల్సన్
సమాధానాలు:
1) బి; 2) డి; 3) బి; 4) ఎ; 5) ఎ; 6) సి; 7) బి; 8) బి; 9) ఎ; 10) డి; 11) డి; 12) డి; 13) ఎ; 14) సి; 15) డి; 16) ఎ; 17) సి.
Admissions Into PG Course: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మాదిరి ప్రశ్నలు
1. సోనిక్ బూమ్ దేనికి సంబంధించినది?
ఎ) లేజర్ కిరణాలు బి) రాడార్
సి) సూపర్‌సోనిక్ విమానం డి) పరావర్తనం
2. సోనోగ్రఫీలో వాడే తరంగాలు ఏవి?
ఎ) మైక్రోవేవ్
బి) ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు
సి) శబ్ద తరంగాలు
డి) అల్ట్రాసోనిక్ తరంగాలు
3. స్టెతస్కోప్‌లో శబ్దం పెద్దగా వినపడటానికి కారణం?
ఎ) అనునాద శబ్దం బి)సం΄ోషక వ్యతికరణం
సి) అధ్యారోపనం డి) పరావర్తనం
4. ధ్వని తీవ్రత స్థాయిని కొలవడానికి ఉపయోగించేది?
ఎ) హెర్ట్ ్జ బి) బెల్
సి) జౌల్స్ డి) ఆంగ్‌స్ట్రామ్
5. ధ్వని లక్షణం?
ఎ) స్థాయి బి) విరళీకరణం
సి) ప్రతిధ్వని డి) సహకార ధ్వని
6. ధ్వని ఎందులో అధికంగా ప్రయాణిస్తుంది?
ఎ) నీరు బి) గాలి
సి) ఉక్కు డి) ఖాళీ స్థలం
7. అల్ట్రాసోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు?
ఎ) ఎలుక బి) ఉడుత
సి) పిల్లి డి) గబ్బిలం
8. స్త్రీ కంఠం పురుషుడి çకంఠం కంటే సన్నగా ఉండటానికి కారణం?
ఎ) అధిక పౌనపున్యం బి) అధిక తరంగదైర్ఘ్యం
సి) తక్కువ పౌనపున్యం డి) ఎ, సి
9. గాలిలోని శబ్దవేగం దేని ద్వారా మార్పుచెందదు?
ఎ) సాంద్రత బి) తేమ
సి) ఉష్ణోగ్రత డి) హెచ్చు స్థాయి
10. మాక్ నంబర్ దేని వేగానికి సంబంధించింది?
ఎ) ధ్వని బి) ఓడలు
సి) యుద్ధ విమానం డి) అంతరిక్షనౌక
11. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం
ఎ) ఆల్టీమీటర్ బి) అమ్మీటర్
సి) బారోమీటర్ డి) ఆడియో మీటర్
12. సోనార్‌ను ఎక్కువగా ఎవరు వినియోగిస్తారు?
ఎ) నావికులు బి) వ్యోమగాములు
సి) డాక్టర్లు డి) ఇంజనీర్లు
13. డాఫ్లర్ ప్రభావం దేనికి సంబంధించింది?
ఎ) ధ్వని బి) అయస్కాంతం
సి) ఉష్ణం డి) విద్యుత్
14. మునిగి΄ోయిన వస్తువులను గుర్తించేందుకు వాడే పరికరం?
ఎ) రాడార్ బి) సోనార్
సి) క్వాసార్ డి) పుల్సర్
15. నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే పరికరం?
ఎ) గైరోస్కోప్ బి) ఎపిడయోస్కోప్
సి) హైడ్రోఫోన్ డి) ఫొటోమీటర్
16. ధ్వని పిచ్ దేనిపై ఆధారపడుతుంది?
ఎ) స్వభావం బి) తరంగదైర్ఘ్యం
సి) పౌనపున్యం డి) గమనం
17. కింది వాటిలో పిచ్ అధికంగా ఉండే జీవులు?
ఎ) చిన్నపిల్లలు బి) పురుషులు
సి) పులులు డి) ఏనుగులు
18. కిందివాటిలో ధ్వని తీవ్రత గుణం తక్కువగా ఉన్నవారు?
ఎ) పురుషులు బి) దోమలు
సి) సింహాలు డి) పైవన్నీ
19. ధ్వని తీవ్రతను కొలిచే సాధనం ఏది?
ఎ) టోనోమీటర్ బి) పిచ్ స్కేల్
సి) ఫైరో మీటర్ డి) ఆడియో మీటర్
20. ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు?
ఎ) రైట్ బ్రదర్స్ బి) కారియర్
సి) నరేంద్రసింగ్ కపానీ డి) ఫెర్మి
21. న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కర్త?
ఎ) రైట్ బ్రదర్స్ బి) కారియర్
సి) నరేంద్రసింగ్ కపానీ డి) ఫెర్మి
సమాధానాలు:
1) సి; 2) డి; 3) డి; 4) బి; 5) ఎ;
6) సి; 7) డి; 8) ఎ; 9) డి; 10) సి;
11) డి; 12) ఎ; 13) ఎ; 14) బి; 15) సి; 16) సి; 17) ఎ; 18) బి; 19) డి; 20) సి;
21) డి.
Tags
- study material for competitive exams
- physics study material
- bits of physics competitive exams
- preparation bits for competitive exams
- study material physics
- physics for competitive exams preparations
- competitive exams preparations for physics
- study material and bits for physics exam
- study material and bits for groups exam
- appsc and tspsc groups exam study material
- groups exam preparations
- practicing bits for physics groups exam
- Education News
- Sakshi Education News