Skip to main content

భారత రిజర్వు బ్యాంక్ తొలి గవర్నర్ ఎవరు?

ద్రవ్య నిర్వహణ:
2018-19లో నికర రికవరీ కాని రుణాల నిష్పత్తిలో తగ్గుదల, పరపతి వృద్ధిలో వేగవంతం కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రగతి మెరుగైంది. మూలధన మార్కెట్ నుంచి ఈక్విటీ ఫైనా న్స్‌, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రంగంలోని ఒత్తిడుల కారణంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యవనరుల ప్రవాహం తగ్గింది. 2017-18తో పోల్చినప్పుడు 2018-19లో రిజర్వు ద్రవ్యంలో వృద్ధి 14.5 శాతంగా నమోదైంది. చలామణీలో ఉన్న ద్రవ్యంలో పెరుగుదల కారణంగా రిజర్వు ద్రవ్యంలో అధిక వృద్ధి నమోదైంది. వివిధ ఆధారాల వైపు నుంచి పరిశీలించినప్పుడు 2018-19 లో రిజర్వు ద్రవ్యంలో పెరుగుదలకు ప్రభుత్వానికి నికర రిజర్వు బ్యాంక్ పరపతి కూడా కారణమైంది. గత సంవత్సరంతో పోల్చినపుడు నికర విదేశీ ఆస్తుల్లో తగ్గుదల సంభవించినప్పటికీ ఈ మొత్తం కూడా రిజర్వు ద్రవ్యం పెరుగుదలకు కారణమైంది.
  • విశాల ద్రవ్యం (M3)లో 2009 సంవత్సరం తర్వాత తగ్గుదల ఏర్పడింది. సమష్టి డిపాజిట్లలో పెరుగుదల కారణంగా 2018-19లో విశాల ద్రవ్యంలో పెరుగుదల ను గమనించవచ్చు. విశాల ద్రవ్యంలో భాగమైన వివిధ అంశాలను పరిశీలించినప్పుడు కరెన్సీ, డిపాజిట్లలో పెరుగుదల కారణంగా విశాల ద్రవ్యంలో పెరుగుదల ఏర్పడింది. డిమాండ్, టైమ్ డిపాజిట్లలో (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) పెరుగుదల వేగవంతమైంది. సమష్టి డిపాజిట్లలో వృద్ధి 2017-18 లో 5.8 శాతం కాగా 2018-19లో 9.6 శాతానికి పెరిగింది. వివిధ ఆధారాలను పరిశీలించినప్పుడు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల నుంచి వాణిజ్య రంగానికి పరపతి పెరిగినందువల్ల విశాల ద్రవ్యంలో పెరుగుదల ఏర్పడటాన్ని గమనించవచ్చు. ప్రభుత్వానికి బ్యాంక్ పరపతి ముఖ్యంగా రిజర్వు బ్యాంకు పరపతి కూడా విశాల ద్రవ్యం(M3)లో పెరుగుదలకు కారణ మైంది.
  • 2018 ఆగస్టు వరకు ద్రవ్యత్వ స్థితిగతులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ సెప్టెంబర్ తర్వాత ద్రవ్యత్వం క్షీణించింది. 2018-19 సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల లోనూ, 2019-20 మొదటి త్రైమాసికం లోను ద్రవ్యత్వ స్థితి సగటున లోటును ఎదుర్కొంది. 2018 సెప్టెంబర్ 15 - 26 మధ్య కాలంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ అధిక ద్రవ్యత్వ కొరతను ఎదుర్కొంది. ఈ కాలంలో ద్రవ్యత్వ లోటు రూ.1.18 లక్షల కోట్లుగా నమోదైంది. బహిరంగ మార్కెట్ చర్యల్లో భాగంగా రిజర్వు బ్యాంక్ రూ.30,000 కోట్లను ప్రకటించింది. ఈ చర్య ద్రవ్యత్వ కొరతను తాత్కాలికంగా కొంత మేర సులభతరం చేసినప్పటికీ ద్రవ్యత్వ కొరత దీర్ఘకాలంగా కొనసాగే సూచన గానే మిగిలిపోయింది.
  • స్వదేశీ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పనితీరు 2018-19లో మెరుగైంది.
    a. 2018 మార్చి నుంచి డిసెంబర్ 2018 మధ్య కాలంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల రికవరీ కాని రుణాలు 11.5 శాతం నుంచి 10.1 శాతానికి తగ్గాయి.
    b. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల Restructured Standard Advances నిష్పత్తి 0.7 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గింది.
    c. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల Stressed Advances నిష్పత్తి ఇదే కాలంలో 12.1 శాతం నుంచి 10.5 శాతానికి తగ్గింది.
    d. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్థూల రికవరీ కానీ రుణాల నిష్పత్తి 15.5 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది.
    e. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్టాండర్‌‌డ అడ్వా న్స్‌ నిష్పత్తి ఇదే కాలంలో 16.3 శాతం నుంచి 14.4 శాతానికి తగ్గింది.
    f. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల Capital to risk-weighted asset ratio (CRAR) మెరుగుపడిన కారణంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల CRAR 13.8 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది.
    g. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల return on assets (ROA) 2017-18లో 0.21 శాతం కాగా 2018-19లో 0.03 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో ఈక్విటీపై రాబడి 2.41 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గింది.
  • గత కొన్ని సంవత్సరాలుగా ఆహారేతర బ్యాంక్ పరపతిలో వృద్ధి తగ్గినప్పటికి 2018-19లో మెరుగుపడింది. 2017-18లో ఆహారేతర బ్యాంక్ పరపతి వృద్ధి 7.7 శాతం కాగా 2018-19లో 11.2 శాతానికి పెరిగింది. ఇటీవలి కాలంలో పెద్ద పరిశ్రమల బ్యాంక్ పరపతిలో వృద్ధి నమోదైంది.
మాదిరి ప్రశ్నలు:
Published date : 14 Sep 2019 04:02PM

Photo Stories