Skip to main content

ఆహారధాన్యాల సేకరణ, పంపిణీ నిల్వకు భారత్‌లో బాధ్యతవహించే సంస్థ?

వ్యవసాయం రంగం - ప్రగతి
 తంత్య్రానికి పూర్వం, అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రధాన ఆర్థిక కార్యకలాపంగా నిలిచింది. ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 శాతానికిపైగా భారత జనాభా తమ జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని తీసుకుంది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తి 2008లో 53.09 శాతం కాగా 2011లో 48.96 శాతం, 2018లో 43.86 శాతానికి తగ్గింది. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో సగటున 2.9 శాతంగా నమోదైంది. వ్యవసాయ రంగ కార్యకలాపాలలో పాల్గొనే మహిళల సంఖ్యలో పెరుగుదల ఏర్పడింది. దేశంలో పంటల తీరులో మార్పు సంభవించి చెరకు, రబ్బరు లాంటి వాణిజ్య పంటల కింద భూవిస్తీర్ణం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధిలో పెరుగుదల సంభవించింది. ఆహార ప్రాసెసింగ్ ‘సన్‌రైజ్ పరిశ్రమ’గా రూపొందింది. పారిశ్రామిక, వాణిజ్యపరమైన అవసరాల నిమిత్తం వ్యవసాయ భూమిని వినియోగిస్తున్నందు వల్ల మిగిలిన వ్యవసాయ భూమిపై ఒత్తిడి పెరిగింది.
 
1. ఆహార ప్రాసెసింగ్:
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆహార ప్రాసెసింగ్ అధిక వృద్ధి, అధిక లాభదాయకతతో కూడిన ప్రాధాన్యరంగంగా రూపొందింది. ముడి సరుకులు, వనరుల లభ్యత అధికంగా ఉండటం, ప్రోత్సాహకర విధానం, అనేక ప్రోత్సాహకాల కారణంగా ఆహార ప్రాసెసింగ్‌కు సంబంధించి భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. భారత్ జనాభా 1.3 బిలియన్‌లకు పైగా ఉండటం, భారతీయుని సగటు వయస్సు 29 సంవత్సరాలు, మధ్య తరగతి ప్రజలు తమ వ్యయార్హ ఆదాయంలో అధిక భాగాన్ని ఆహారంపై వ్యయం చేయడం లాంటి అంశాల కారణంగా భారత్ ‘అతిపెద్ద వినియోగదారుల బేస్’గా రూపొందింది. ఆహారం& బేవరేజెస్‌పై మొత్తం వినియోగ వ్యయం విలువ 369 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 1.14 ట్రిలియన్ డాలర్లకు పెరగగలదని అంచనా. ఇదే కాలంలో ఆహార ప్రాసెసింగ్ రంగ ఉత్పత్తి విలువ మార్కెట్ ధరల వద్ద 958 బిలయన్ డాలర్లగా ఉండగలదని అంచనా. ఆహారధాన్యాల ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానం పొందింది.
  భారత్‌లో పెరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న ఆదాయ స్థాయి, ప్యాకేజ్‌డ్ -ప్రాసెసింగ్ ఆహారంపై పెరుగుతున్న అభిరుచి లాంటి అంశాలు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతాయి. ఆహార ప్రాసెసింగ్‌లో ధాన్యాలు, పంచదార, వంట నూనెలు , బేవరేజ్‌స్, డైరీ ఉత్పత్తులు ప్రధాన పరిశ్రమలు కాగా పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీ, Meat processing, ఫిషరీస్, Retail food లాంటివి ఉపరంగాలు. ఆహార ప్రాసెసింగ్ రంగ వృద్ధికి ప్రభుత్వం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. ఈ రంగం 2000 ఏప్రిల్ నుంచి 2017 మార్చి, 2017 మధ్య కాలంలో 7.54 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. 2019-2024 మధ్య కాలంలో ఈ రంగంలో వృద్ధి 12.4 శాతంగా ఉండగలదని అంచనా.
 
 2. 2019-20 కేంద్ర బడ్జెట్ - వ్యవసాయ రంగం:
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2019-20 కేంద్ర బడ్జెట్‌లో రూ.1.39 లక్షల కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.75,000 కోట్లు పి.ఎం.-కిసాన్ పథకం కింద వ్యయం చేస్తారు.
{పధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి రూ.6000 మూడు సమాన వాయిదాలలో 12.6 కోట్లను చిన్న, ఉపాంత రైతులకు అందిస్తారు.
{పధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు రూ.14,000 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం 2018-19లో ఈ పథకానికి రూ.12,975 కోట్లు కేటాయించారు.
{పధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 5.61 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
వివిధ పంటల ధరలలో తగ్గుదల సంభవించినప్పుడు రైతులకు ‘కనీస మద్దతు ధరల’ను అందించడానికి ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకోవడానికి Market Intervention Scheme, ధరల మద్దతు పథకానికి రూ.3000 కోట్లు కేటాయించారు.
{పధానమంత్రి క్రిషి సింఛయ్ యోజనకు ప్రభుత్వం రూ.3,500 కోట్లు కేటాయించింది. ఫిషరీస్ రంగంలో మౌలిక సౌకర్యాల కొరతను నివారించడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రతిపాదించారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పదివేల నూతన రైతు ఉత్పత్తిదారుల ఆర్గనైజేషన్‌‌సను ఏర్పాటు చేస్తారు.
రైతులు e-NAM (జాతీయ వ్యవసాయ మార్కెట్) నుంచి ప్రయోజనం పొందడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.
జీరో బడ్జెట్ వ్యవసాయం అమలుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.
{పతి గ్రామంలో సుస్థిర ఘన వ్యర్థాల నిర్వహణకు స్వచ్ఛ భారత్ మిషన్ విస్తరణ.
నూతన జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా నీటి వనరులు, నీటి సప్లయ్ సక్రమ నిర్వహణ.
 
3. వ్యవసాయ రంగం ముఖ్యాంశాలు:
1951లో వ్యవసాయ కార్మికులు 97.2 మిలియన్‌లు కాగా వీరిలో 71.9 శాతం వ్యవసాయదారులు, 28.1 శాతం వ్యవసాయ కూలీలు. తర్వాతి కాలంలో వ్యవసాయదారుల సంఖ్య తగ్గుతూ వ్యవసాయ కూలీల సంఖ్యలో పెరుగుదల ఏర్పడింది. 2011 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికులు 263.1 మిలియన్‌లు కాగా వీరిలో వ్యవసాయదారులు 45.1 శాతం, వ్యవసాయ కూలీలు 54.9 శాతం.
2017-18లో వరి అధిక ఉత్పత్తి పశ్చిమ బెంగాల్‌లో నమోదు కాగా తర్వాతి స్థానాలలో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లు నిలిచాయి. గోధుమ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా తర్వాతి స్థానాలలో పంజాబ్, మధ్యప్రదేశ్‌లు నిలిచాయి. మొక్కజొన్న ఉత్పత్తి కర్ణాటకలో అధికంగా నమోదు కాగా తర్వాతి స్థానాలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు నిలిచాయి. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉత్తరప్రదేశ్‌లో నమోదైంది.
  2017-18లో వేరుశనగ ఉత్పత్తిలో గుజరాత్ ప్రథమ స్థానం పొందగా తర్వాతి స్థానాలలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి. మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవగా తర్వాతి స్థానాలలో రాజస్థాన్, గుజరాత్‌లు నిలిచాయి.
  2017-18లో చెరకు ఉత్పత్తి అధికంగా ఉత్తరప్రదేశ్‌లో నమోదైంది. చెరకు అధిక ఉత్పత్తిపరంగా మహారాష్ర్ట రెండో స్థానాన్ని, కర్ణాటక మూడో స్థానాన్ని పొందాయి. పత్తి ఉత్పత్తిలో గుజరాత్ ప్రథమ స్థానం పొందగా తర్వాతి స్థానాలలో మహారాష్ర్ట, తెలంగాణలు నిలిచాయి.
  వ్యవసాయ రంగంలో లాభదాయకత క్షీణిస్తున్నందు వల్ల ప్రైవేటు పెట్టుబడులలో తగ్గుదల ఏర్పడింది. స్థిర ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి మొత్తం 2011-12లో 18.2 శాతం నుంచి 2017-18లో 15.2 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో ప్రైవేటు రంగ పెట్టుబడి 15.9 శాతం నుంచి 12.2 శాతానికి తగ్గగా, ప్రభుత్వ రంగ పెట్టుబడి 2.4 శాతం నుంచి 3 శాతానికి పెరిగింది.
  స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయం, అడవులు, ఫిషరీస్ రంగాల వాటా 2012-13లో 17.8 శాతం కాగా తర్వాతి కాలంలో క్రమంగా తగ్గుతూ 2018-19లో 14.4 శాతానికి తగ్గింది. జి.వి.ఎ.లో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా తగ్గుదలకు పంటల వాటాలో తగ్గుదల కారణమైంది. ఇదే కాలంలో జి.వి.ఏ.లో పశుసంపద, ఫిషరీస్ వాటాలో కొద్దిమేర పెరుగుదల ఏర్పడినప్పటికి పంటల వాటాలో తగ్గుదల అధికంగా నమోదైంది.
 
 4. ఆహారధాన్యాల విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత - రాష్ట్రాల ప్రగతి:
  2017-18లో దేశంలో ఆహారధాన్యాల కింద ఉన్న మొత్తం భూవిస్తీర్ణంలో (127.56 మిలియన్ హెక్టార్‌లు) ఉత్తరప్రదేశ్ వాటా 15.54 శాతం కాగా, తర్వాతి స్థానాలలో మధ్యప్రదేశ్ (13.36 శాతం), రాజస్థాన్ (11.16 శాతం)లు నిలిచాయి. దేశంలో ఆహారధాన్యాల కింద ఉన్న మొత్తం విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ వాటా 3.25 శాతం కాగా తెలంగాణ వాటా 2.55 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో ఆహారధాన్యాల కింద ఉన్న విస్తీర్ణం 4.14 మిలియన్ హెక్టార్లు కాగా తెలంగాణలో 3.25 మిలియన్ హెక్టార్లు.
  2017-18లో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 284.83 మిలియన్ టన్నులుగా నమోదైంది. మొత్తం ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ వాటా అధికంగా 17.99 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా 4.27 శాతంగా, తెలంగాణ వాటా 3.30 శాతంగా నమోదైంది. ఆహారధాన్యాల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లో 12.16 మిలియన్ టన్నులు కాగా, తెలంగాణలో 9.14 మిలియన్ టన్నులుగా నమోదైంది.
  2017-18లో దేశంలో ఆహారధాన్యాల దిగుబడి సగటు హెక్టారుకు 2233 కేజీలు కాగా పంజాబ్‌లో ఆహారధాన్యాల దిగుబడి అధికంగా (4715 కేజీలు హెక్టారుకు) నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆహారధాన్యాల దిగుబడి హెక్టారుకు 2934 కేజీలు కాగా తెలంగాణలో 2893 కేజీలు.
  దేశంలో నీటిపారుదల వసతి కలిగిన ఆహారధాన్యాల కింద ఉన్న విస్తీర్ణం మొత్తం ఆహారధాన్యాల విస్తీర్ణంలో 1950-51లో 18.10 శాతం నుంచి 1966-67లో 22.21 శాతానికి, 2014-15లో 53.1 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల విస్తీర్ణంలో నీటిపారుదల వసతి కలిగిన విస్తీర్ణం పరంగా పంజాబ్ ప్రథమ స్థానం పొందగా, హర్యానా రెండో స్థానం పొందింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆహారధాన్యాల కింద ఉన్న విస్తీర్ణంలో నీటివసతి కల్గిన విస్తీర్ణం 66.5 శాతం కాగా తెలంగాణలో 64.3 శాతం.
 
5. మద్దతు ధరలు - 2019-20 : 
{పభుత్వం 2019-20 సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను పెంచింది. క్వింటాల్ వరి కామన్ గ్రేడు ఖరీఫ్ ధరను రూ.1815గాను, గ్రేడ్-ఏ ధరను రూ.1835గా ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ మొక్కజొన్న ధర క్వింటాల్ (రూ.1760), పత్తి medium staple రకం (రూ.5255), పత్తి Long staple (రూ.5550), జొన్న హైబ్రిడ్ (రూ.2550), వేరుశనగ (రూ.5090)గా ప్రభుత్వం ప్రకటించింది. గోధుమ రబీ పంట ధర క్వింటాల్‌కు రూ.1925, బార్లీ క్వింటాల్‌కు రూ.1525, జౌళి క్వింటాల్‌కు రూ.3950 కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది.
 
మాదిరి ప్రశ్నలు :
Published date : 30 Dec 2019 01:56PM

Photo Stories