Skip to main content

TSPSC Groups: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీ ఇంకెప్పుడు..?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్‌–4 కొలువుల ప్రకటనకు ఇప్పట్లో అడుగు ముందుకు పడే అవకాశం కనిపించడంలేదు.
tspsc group 4 jobs notification problems
TSPSC Group 4 Jobs Notification Problems

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,163 గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి కదలిక లేదు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సీఎస్‌ ఆదేశాల ప్రకారం మే 29 నాటికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయానికి శాఖల వారీగా ఇండెంట్లు (ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్‌ వారీగాకొలువుల భర్తీకి ప్రతిపాదనలు) సమర్పించాల్సి ఉంది.ఈ మేరకు సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సీఎస్‌ డెడ్‌లైన్‌ కూడా విధించారు. అయినా ఒక్క శాఖ నుంచి కూడా టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు చేరకపోవడం గమనార్హం.

TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు

ఆల‌స్యంకు కారణం ఇదేనా..?
ప్రభుత్వ శాఖల వద్ద గ్రూప్‌–4 కేటగిరీలోకి వచ్చే కొలువుల ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంది. అయితే నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు, రోస్టర్‌ వారీగా భర్తీ చేయాల్సినవెన్ని? తదితర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఇటీవల ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు.

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

దీంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ శాఖలు ఆ దిశగా గణాంకాలను సిద్ధం చేసుకోగా, వాటిని టీఎస్‌పీఎస్సీకి సమర్పించాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పించే ముందు ఆయా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన ఖాళీలకు తగినట్లుగా టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిస్తారు. సాధారణంగా ఇదే పద్ధతి ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. మే 29లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్‌ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఆ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూసిన శాఖలు, నిర్దేశించిన గడువులోగా అవి వెలువడకపోవడంతో ప్రతిపాదనలు సమర్పించలేదని తెలుస్తోంది.

Group 1 & 2 : సిలబస్‌ దాదాపు ఒక్కటే.. ఈ చిన్న మార్పులను గమనిస్తే..: కె.సురేశ్‌ కుమార్‌ గ్రూప్‌–1 విజేత

హడావుడిగా సాగి.. తీరా గడువులోగా జీవోలు రాకపోవడంతో.. 
వివిధ శాఖల్లో గ్రూప్‌–4 కేటగిరీలో 9,163 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిని రిజర్వేషన్లకు అనుగుణంగా విభజించి నూతన జోనల్‌ విధానం ప్రకారంభర్తీ చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో రెండు వారాల క్రితం ఓ సమావేశాన్ని నిర్వహించారు.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?  

ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్‌ చైర్మన్‌ దీనికి హాజరు కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో సైతం హడావుడి నెలకొంది. ప్రభుత్వ సమావేశాలకు ఆయన రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగాల భర్తీ వేగిరమైందని భావించారు. దీంతో దాదాపు అన్ని శాఖలు నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. కానీ తీరా గడువులోగా జీవోలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది.

తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న‌ గ్రూప్‌-4 ఉద్యోగాలు : 9,168  

పేపర్-1 (మార్కులు 150) :

Group4


➤ జనరల్ నాలెడ్జ్
➤ వర్తమాన వ్యవహారాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం
➤ పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ
➤ భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు
➤ భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
➤ భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
➤ జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
➤ తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
➤ తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

పేపర్ -2 (మార్కులు 150) : 

Group 4 Exam Syllabus


☛ పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
☛ మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్)
☛ లాజికల్ రీజనింగ్
☛ కాంప్రహెన్షన్
☛ రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్
☛ న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

Published date : 30 May 2022 01:46PM

Photo Stories