Skip to main content

TS High court : గ్రూప్‌-1, 2 పరీక్షల్లో వీరికి ఎక్స్‌ట్రా టైం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వ‌హించే గ్రూప్-1 & 2 ప‌రీక్ష‌ల్లో దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్ర‌కారం దివ్యాంగులకు ఎక్క‌వ స‌మ‌యం (extra time for physically handicapped persons) కేటాయించకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.
Court Orders Response on Disabilities Act Violation in TSPSC Group-1 & 2 Exams, extra time for physically handicapped persons news in telugu, Government Directed to Respond on Extra Time for Physically Handicapped in Group-1 & 2 Exams,

ఈనెల నవంబర్ 28వ తేదీలోగా కౌంటరు దాఖలు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్‌ 2(ఆర్‌) ప్రకారం 40 శాతం వైకల్యం ఉన్నట్లయితే స్క్రైబ్‌, గంటకు అదనంగా 20 నిమిషాల సమయం ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పెద్దపల్లికి చెందిన ఎన్‌.సాయిరాం, మరో ముగ్గురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కేంద్రం జారీచేసిన మెమోను అమలు చేయడం లేదన్నారు. 

గతంలో దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా ఎలాంటి కౌంటరు దాఖలు చేయలేదన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ ఇది ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖ తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తుందని, ఇందులో తాము నామమాత్రపు ప్రతివాది మాత్రమేనన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను న‌వంబ‌ర్ 28వ తేదీకి వాయిదా వేశారు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 18 Nov 2023 08:21AM

Photo Stories