Skip to main content

APPSC Groups: గ్రూప్‌ 1,2 పోస్టుల భర్తీకి అనుమతి.. త్వరలోనే నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌–1, 2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది.
APPSC Jobs Notification
APPSC Group 1&2 Jobs

ఈమేరకు ఆర్థిక  శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్ మార్చి 31వ తేదీ(గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్‌–1లో 110, గ్రూప్‌–2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు. గతంలో ప్రకటించిన జాబ్‌ క్యాలండర్‌ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్‌–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.

ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

    పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్టడీ మెటీరియల్‌ కోసం పుస్తకాల షాపులను, నిపుణులను సంప్రదిస్తున్నారు. మరోవైపు స్టడీ హాళ్లు, లైబ్రరీలు సందడిగా మారాయి. 

Group 1 JobsGroup 2 Jobs

ఒత్తిళ్లను అధిగమించేందుకు..
ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు పోటీ పరీక్షలనగానే ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు  సానుకూలమైన దృక్పథంతో అధ్యయనం ఆరంభించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

స్పష్టమైన ల‌క్ష్యంతో..
పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారు మొదట స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల బలమైన ఆకాంక్షను కలిగి ఉండాలి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి దరఖాస్తు చేస్తున్నాం అనే మొక్కుబడి వైఖరితో కాకుండా ఆ ఉద్యోగం తనకు ఎందుకు తప్పనిసరి అవసరమనే విషయంపై స్పష్టత ఏర్పర్చుకోవాలి. అనంతరం పరీక్షలకు అవసరమైన మెటీరియల్, కోచింగ్‌ వంటివి  సమకూర్చుకొని మానసిక, శారీరక సంసిద్ధతతో ప్రిపరేషన్‌ ఆరంభించాలి. 

ఎలాంటి ఒత్తిడి.. టెన్ష‌న్ లేకుండా.. గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవ్వండిలా..

తప్పకుండా విజయం సాధిస్తామనే..
ప్రిపరేషన్‌ ప్రారంభించిన తర్వాత కూడా చాలా మంది  ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. లక్షలాది మందితో పోటీపడడం తనకు సాధ్యం కాదేమోననే ఆందోళనకు గురవుతారు. తమ చుట్టూ ఉన్నవారు బాగా చదువుతున్నారని, తాము మాత్రమే  వెనుకబడిపోతున్నామనే భావన కొంతమందిని వెంటాడుతుంది. ఇలాంటి సంశయాత్మక వైఖరి వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే సానుకూలమైన  భావనతో అధ్యయనం మొదలుపెట్టాలి. రాయబోయే పోటీపరీక్షలో తాను విజేతగా నిలవబోతున్నాననే ప్రగాఢమైన నమ్మకంతో సన్నద్ధం కావాలి.  

పోటీప‌రీక్ష‌ల్లో కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే ఏం చేయాలి? ఎలా చ‌ద‌వాలి?

ఇది సరైన పద్ధతి కాదు..
సాధారణంగా చాలా మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో తేలిగ్గా ఉండే అంశాలతో ప్రారంభించి ఆ తర్వాత  కఠినమైన అంశాల్లోకి వెళ్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికి వారు తమకు  కఠినమైనవిగా అనిపించిన పాఠ్యాంశాలను మొదట ఓ పట్టుపడితే  ఆ తర్వాత తేలిగ్గా ఉన్న అంశాలను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.  

ఎన్ని గంటలు చదివామనే దాని కంటే..

డాక్టర్‌ గీత చల్లా, మానసిక నిపుణులు


ఇతరులతో పోల్చుకొని తాము వెనుకబడిపోతున్నామని ఆందోళనకు గురికావొద్దు. తోటివారితో పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ తమ ప్రిపరేషన్‌ను నిరుత్సాహానికి గురి చేసేలా ఉండకూడదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే ఆ రోజు చదివిన అంశాలపై మన అవగాహన ఏ స్థాయిలో ఉంది అనేది అంచనా వేసుకోవడం మంచిది. 
                                                                                                   - డాక్టర్‌ గీత చల్లా, మానసిక నిపుణులు

పోటీప‌రీక్ష‌ల బిట్స్‌ కోసం క్లిక్ చేయండి

యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా.. 

డాక్టర్‌ సంహిత, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌


ప్రిపరేషన్‌ సమయంలో ఆందోళనకు గురైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. దీంతో  శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి. అలసట లేకుండా  అధ్యయనం చేయగలుగుతారు. సరైన  నిద్ర, చక్కటి పోషకాహారం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం.
                                                                                                     – డాక్టర్‌ సంహిత, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌

సమయాన్ని..
పోటీ పరీక్షల్లో సమయ పాలన కూడా ప్రధానం. సమయం వృథా చేయకుండా సంబంధిత సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి. పరీక్ష రాసేటప్పుడు కూడా ముందుగానే  ప్రశ్నలకు సమయం కేటాయించుకొని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి.

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

​​​​​​​గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

Published date : 01 Apr 2022 10:24AM

Photo Stories