Competitive Exams: పోటీపరీక్షల్లో కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే ఏం చేయాలి? ఎలా చదవాలి?
కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే రోజూ వార్తా పత్రికలు చదవడం తప్పనిసరి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లను ఎంపిక చేసుకొని, చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పోటీ పరీక్షలను బట్టి కరెంట్ అఫైర్స్ ప్రశ్నల సరళి, క్లిష్టత మారుతుంది. అయితే ప్రధానంగా ఈ కింది విభాగాల సమకాలీన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
☛ రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు.
☛ వాణిజ్య వ్యవహారాలు.
☛ సైన్స్ అండ్ టెక్నాలజీ.
☛ పర్యావరణం.
☛ వార్తల్లో వ్యక్తులు.
☛ రాజకీయ సంఘటనలు
☛ భౌగోళిక ప్రాధాన్య ప్రదేశాలు
☛ రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు.
☛ క్రీడల సమాచారం.
☛ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు
☛ అంతర్జాతీయ సదస్సులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో..
పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని,దానికి అనుగుణంగా సిద్ధంకావాలి. ఇందుకోసం గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, వాటి క్లిష్టతను పరిశీలించాలి. బ్యాంకు పరీక్షల్లో ఎక్కువగా బ్యాంకింగ్, ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వాల వార్షిక బడ్జెట్‌లు, ఆర్థిక సర్వేలు, ప్రభుత్వ పథకాలు, ఆర్‌బీఐ ప్రకటించే పాలసీ రేట్లు, పంచవర్ష ప్రణాళికలు, వివిధ కమిషన్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు రాష్ట్రస్థాయి సంఘటనలను కూడా చదవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాలు, పురస్కారాలు వంటి వాటిని చదవాలి.