Skip to main content

TSPSC Groups: గ్రూప్స్ సిలబస్‌లోని ‘ తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం ’ ఎలా ప్రిపేర్ కావాలి ?

‘తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం’ను మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి.. ఐడియా ఆఫ్ తెలంగాణ(1948-70); సమీకరణ దశ (1971-90); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014). ఆయా విభాగాలకు సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాల వారీగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
Telangana movement
Telangana movement

గ్రూప్-1, గ్రూప్-2 రెండు పరీక్షలకూ సన్నద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ కోణంలో డిస్క్రిప్టివ్ విధానంలో చదువుతూ ముఖ్యాంశాలతో బిట్స్/షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే గ్రూప్-2కు కూడా ఉపకరిస్తుంది. ఐడియా ఆఫ్ తెలంగాణ విభాగానికి సంబంధించి అభ్యర్థులు 1948లో హైదరాబాద్‌పై పోలీస్ చర్య నుంచి ప్రిపరేషన్ ప్రారంభించొచ్చు. ఈ క్రమంలో జరిగిన ముఖ్య పరిణామాలు తెలుసుకోవాలి. ముల్కీ ఆందోళన, స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్, సిటీ కాలేజీ ఘటన, దాని ప్రాముఖ్యత, తెలంగాణ రాష్ట్ర డిమాండ్, చర్చ, ఫజల్ అలీ కమిషన్, సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం తదితర అంశాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి.

Competitive Exams: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?

సమీకరణ దశ కోసం అభ్యర్థులు కొంత ఎక్కువ కసరత్తు చేయాలి. కారణం ఈ దశలో ఎన్నో ముఖ్య ఘట్టాలు, పరిణామాలు జరిగాయి. జై ఆంధ్ర ఉద్యమం; 1973లో రాష్ట్ర‌ప‌తి పాలన, ఆరు సూత్రాల పథకం; తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు; రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు లాంటివి చదవాలి. ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు, తెలంగాణ అస్తిత్వ అణచివేత; తెలంగాణ ఆత్మాభిమానం, భాషా సంస్కృతులపై దాడి తదితర అంశాలను అధ్యయనం చేయాలి. 1990 దశకంలో ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వాటి ప్రభావం; పెరిగిన ప్రాంతీయ అసమానతలు; తెలంగాణలో వ్యవసాయం, చేతివృత్తుల రంగాల్లో సంక్షోభం, తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం గురించి అధ్యయనం చేయాలి.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

 

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంశం కోసం గ్రూప్స్ అభ్యర్థులు 1991-2014 మధ్యకాలంలో ఏర్పాటైన ముఖ్యమైన పార్టీలు/సంస్థల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజా చైతన్యం, పౌరసంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అస్థిత్వ భావన, తెలంగాణ ఐక్య వేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక లాంటి అంశాలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. తర్వాతి పరిణామాలతోపాటు పత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ సిఫారసుల తర్వాత క్రమంలో తెలంగాణ ఏర్పాటు దిశగా జరిగిన అన్ని పరిణామాలపై అవగాహన ఎంతో ముఖ్యం.

Groups: గ్రూప్‌–1&2లో ఉద్యోగం సాధించ‌డం ఎలా ?

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

Published date : 23 Mar 2022 07:04PM

Photo Stories