Skip to main content

APPSC: గెజిటెడ్‌ ఆఫీసర్‌.. అర్హతలు, వయో పరిమితి వివరాలు

APPSC
గెజిటెడ్‌ ఆఫీసర్‌.. అర్హతలు, వయో పరిమితి వివరాలు

అర్హతలు

  • ఆయా పోస్ట్‌లను అనుసరించి..అర్హత ప్రమాణాలు కూడా వేర్వేరుగా నిర్దేశించారు.ఆ వివరాలు..
  • ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ ఉత్తీర్ణత.
  • సెరికల్చర్‌ ఆఫీసర్‌: సెరికల్చర్‌ లేదా బోటనీ లేదా జువాలజీ స్పెషలైజేషన్లలో ద్వితీయ శ్రేణితో పీజీ ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
  • అగ్రికల్చర్‌ ఆఫీసర్‌: ఐసీఏఆర్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
  • డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లో బీటెక్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ ఒక సబ్జెక్ట్‌గా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌. దీంతోపాటు ఆర్టీసీ వర్క్‌షాప్‌ లేదా డిఫెన్స్‌ మోటార్‌ వర్క్‌ షాప్‌ లేదా మోటార్‌ వెహికల్స్‌ మరమ్మతులు, నిర్వహణ చూసే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వర్క్‌ షాప్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అదే విధంగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లలో ఏదో ఒక భాషలో రాయడం, చదవడం తెలిసుండాలి. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
  • అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎండోమెంట్స్‌: న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఏపీ హైకోర్ట్‌లో అడ్వకేట్‌గా మూడేళ్లు ప్రాక్టీస్‌ చేసి ఉండాలి. అభ్యర్థులు హిందూ మతస్తులై ఉండాలి.
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హార్టికల్చర్‌: నాలుగేళ్ల బీఎస్సీతోపాటు ఎమ్మెస్సీ హార్టికల్చర్‌ లేదా హార్టికల్చర్‌లో బీఎస్సీ ఆనర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయో పరిమితి

  • వయసు జూలై 1, 2021 నాటికి 18– 42 ఏళ్ల మధ్య ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు 21– 28 ఏళ్లు, ఎండోమెంట్‌ కమిషనర్‌ పోస్ట్‌లకు 28–42 ఏళ్లుగా వయో పరిమితిని పేర్కొన్నారు.
  • రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

>> APPSC: గెజిటెడ్‌ ఆఫీసర్‌.. ఎంపిక విధానం ఇలా

>> APPSC: గెజిటెడ్‌ ఆఫీసర్‌.. ఎంపిక, ప్రిపరేషన్‌ ప్రణాళిక

Published date : 29 Nov 2021 03:18PM

Photo Stories