Skip to main content

APPSC: గెజిటెడ్‌ ఆఫీసర్‌.. ఎంపిక, ప్రిపరేషన్‌ ప్రణాళిక

APPSC
గెజిటెడ్‌ ఆఫీసర్‌.. ఎంపిక, ప్రిపరేషన్‌ ప్రణాళిక

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక

అభ్యర్థులు రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా.. పోస్ట్‌ల సంఖ్య, రిజర్వేషన్‌లను అనుసరించి తుది జాబితా ప్రకటిస్తారు. ఒక్కో పోస్ట్‌కు సంబంధించి.. వేర్వేరు పేపర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఆ వివరాలు..

ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌


పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

మార్కులు

1

జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

150

150

2

ఫిషరీస్‌ సైన్స్‌–1

150

150

3

ఫిషరీస్‌ సైన్స్‌–2

150

150

సెరికల్చర్‌ ఆఫీసర్‌


పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

మార్కులు

1

జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

150

150

2

సెరికల్చర్‌–1

150

150

3

సెరికల్చర్‌–2

150

150

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌

పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

మార్కులు

1

జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

150

150

2

అగ్రికల్చర్‌

150

150

డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌


పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

మార్కులు

1

జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

150

150

2

అర్థమెటిక్‌

150

150

3

మెన్సురేషన్‌

150

150

టెక్నికల్‌ అసిస్టెంట్‌


పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

మార్కులు

1

జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

150

150

2

ఆటోమొబైల్‌

 

 

 

ఇంజనీరింగ్‌

150

150

అసిస్టెంట్‌ కమిషనర్‌–దేవదాయ శాఖ


పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

మార్కులు

1

జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

150

150

2

హిందూ లా(పేపర్‌–1)

150

150

3

హిందూ రెలిజియస్‌ ఎండోమెంట్స్‌యాక్ట్‌

150

150

హార్టికల్చర్‌ ఆఫీసర్‌


పేపర్‌

సబ్జెక్ట్‌

ప్రశ్నలు

మార్కులు

1

జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

150

150

2

హార్టికల్చర్‌–1

150

150

3

హార్టికల్చర్‌–2

150

150

  • అగ్రికల్చర్‌ ఆఫీసర్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లు మినహా మిగతా అన్ని పోస్ట్‌లకు మూడు పేపర్లలో పరీక్ష జరుగుతుంది.
  • పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహాలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో ఉంటుంది.
  • ప్రతి పేపర్‌కు 150 ప్రశ్నలు–150 మార్కులు కేటాయించారు.
  • మూడు పేపర్లు ఉన్న పోస్ట్‌లకు 450 మార్కులు, రెండు పేపర్లు ఉన్న పోస్ట్‌లకు 300 మార్కులతో పరీక్ష నిర్వహిస్తారు.
  • అన్ని పోస్ట్‌లకు జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌ ఉంటుంది.
  • డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ మినహా అన్ని పోస్ట్‌లకు పరీక్ష ఇంగ్లిష్‌ మీడియంలోనే జరుగుతుంది.

రాత పరీక్షలో రాణించాలంటే

  • రాత పరీక్షలో రాణించాలంటే.. అభ్యర్థులు పేపర్‌ వారీగా పక్కా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • అన్ని పోస్ట్‌లకు ఉండే జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీకి.. సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న జాతీయ,అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలు, చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పాలిటీపై పట్టు సాధించాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యంగా కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవాలి. రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక వనరులు, చరిత్ర, సంస్కృతి, ఆర్థికాభివృద్ధి అంశాలు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు–లక్షిత వర్గాలు–లబ్ధిదారులు–బడ్జెట్‌ కేటాయింపులు తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి.
  • రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్‌ను, ఆర్థిక సర్వేలపై గణాంక సహిత సమాచారంతో అవగాహన ఏర్పరచుకోవాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో ప్రయోగించిన ఉపగ్రహాలు, డిఫెన్స్‌ రంగంలో నూతన క్షిపణుల ప్రయోగాలు, బేసిక్‌ సైన్స్‌ అంశాలపై అవగాహన పొందాలి.
  • మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించి ప్రధానంగా డేటా విశ్లేషణ, సేకరణ, విశదీకరణ నైపుణ్యాలు పొందాలి.
  • సబ్జెక్ట్‌ పేపర్లకు ఇలా
  • అన్ని పోస్ట్‌లకు సబ్జెక్ట్‌ పేపర్‌లకు సంబంధించి.. ఆయా సబ్జెక్ట్‌ల బ్యాచిలర్‌ స్థాయి అకడమిక్‌ పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి. సిలబస్‌ను పరిశీలిస్తూ..పేపర్‌ వారీగా అకడమిక్‌ సిలబస్‌ను విభజించుకోవాలి. ఆ తర్వాత ప్రతి పేపర్‌లోని అన్ని అంశాలు చదివేలా సమయ పాలన పాటించాలి. ఆయా అంశాలను డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదువుతూ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సన్నద్ధమవ్వాలి. పాత ప్రశ్న పత్రాలు లేదా మోడల్‌ ప్రశ్న పత్రాలను సాధన చేయాలి.
  • సబ్జెక్ట్‌ పేపర్ల విషయంలోనూ వాటికి సంబంధించి సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవడం మేలు చేస్తుంది. ముఖ్యంగా ఫిషరీస్, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు ఈ దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగించడం ఎంతో ఉపకరిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రారంభించిన ఫిషరీస్‌ పాలసీ, ఆక్వా హబ్‌ల ఏర్పాటు నిర్ణయాలు, రైతు భరోసా కేంద్రాలు, సాగు విధానాల్లో అమలు చేస్తున్న కొత్త పద్ధతులు, వ్యవసాయంలో యాంత్రీకరణ వంటి అంశాల గురించి తెలుసుకోవాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: డిసెంబర్‌ 8–డిసెంబర్‌ 28, 2021
  • దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: డిసెంబర్‌ 27, 2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

>> APPSC: గెజిటెడ్‌ ఆఫీసర్‌.. ఎంపిక విధానం ఇలా

>> APPSC: గెజిటెడ్‌ ఆఫీసర్‌.. అర్హతలు, వయో పరిమితి వివరాలు 

Published date : 29 Nov 2021 03:18PM

Photo Stories