APPSC: గెజిటెడ్ ఆఫీసర్.. ఎంపిక విధానం ఇలా
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీపీఎస్సీ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతుంది! గత కొన్ని నెలలుగా క్రమం తప్పకుండా.. నోటిఫికేషన్లు విడుదల చేస్తూ.. పోస్ట్‌ల భర్తీ దిశగా అడుగులు వేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో నోటిఫికేషన్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏడు శాఖల్లో.. గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దాంతో రాష్ట్రంలోని ఉద్యోగార్థులు ప్రిపరేషన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గెజిటెడ్ ఉద్యోగాల వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్..
ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏ గ్రూప్‌లో డిగ్రీ పూర్తి చేసుకున్నా.. ఎక్కువ మంది అభ్యర్థుల ప్రధాన లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే! ఇందుకోసం వారు.. సర్కారీ కొలువుల భర్తీని చేపట్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లకు సన్నద్ధమవుతుంటారు. వీరు ఇప్పుడు తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. తాజాగా మరో నోటిఫికేషన్‌తో అభ్యర్థుల ముందుకొచ్చింది.
ఏడు శాఖలు.. గెజిటెడ్ పోస్ట్‌లు
- ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పరిధిలోని మొత్తం ఏడు శాఖల్లో గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
- ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏపీ ఫిషరీస్ సర్వీసెస్): పోస్ట్‌ల సంఖ్య–11(వేతన శ్రేణి: రూ.29,760–రూ.80,930)
- సెరికల్చర్ ఆఫీసర్ (ఏపీ సెరికల్చర్ సర్వీస్): పోస్ట్‌ల సంఖ్య–01(వేతన శ్రేణి: రూ. 35,120–రూ.87,130)
- అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏపీ అగ్రికల్చర్ సర్వీస్): పోస్ట్‌ల సంఖ్య–06 (వేతన శ్రేణి: రూ.35,120–రూ.87,130)
- డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ వర్క్స్ అకౌంట్ సర్వీస్): పోస్ట్‌ల సంఖ్య–02 (వేతన శ్రేణి: రూ.29,760–రూ.80,930)
- టెక్నికల్ అసిస్టెంట్(ఏపీ పోలీస్ సర్వీస్): పోస్ట్‌ల సంఖ్య–01(వేతన శ్రేణి: రూ.40, 270 –రూ.93,780)
- దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్: పోస్ట్‌ల సంఖ్య–03(వేతన శ్రేణి: రూ.31, 460–రూ.84,970)
- ఉద్యాన శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్: పోస్ట్‌ల సంఖ్య –01(రూ.40,270–రూ.93, 780)
>> APPSC: గెజిటెడ్ ఆఫీసర్.. అర్హతలు, వయో పరిమితి వివరాలు
>> APPSC: గెజిటెడ్ ఆఫీసర్.. ఎంపిక, ప్రిపరేషన్ ప్రణాళిక
Published date : 29 Nov 2021 03:18PM