Skip to main content

TSPSC Group 4 Application Postponed : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. గ్రూప్‌-4 ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు ప‌క్రియ వాయిదా.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-4 ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ వాయిదా ప‌డింది.
TSPSC Group 4 Applications Latest News
TSPSC Group IV Application Postponed

షెడ్యుల్ ప్ర‌కారం నేటి నుంచి.. అన‌గా డిసెంబ‌ర్ 23వ తేదీ జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల్సింది ఉంది. అయితే కొన్ని టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల కార‌ణంతో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను వారం రోజులు పాటు వాయిదా వేశారు. తిరిగి ఈ గ్రూప్‌-4 ద‌రఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 19వ తేదీ సాయంత్రం 5:00గంట‌ల వ‌ర‌కు స్వీక‌రించ‌నున్నారు. అలాగే పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in/ ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు. ఇలా అయితే గ్రూప్ 4  రాత‌పరీక్షను మే లేదా జూన్ లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9,168 గ్రూప్‌-4 సర్వీసెస్ పోస్టుల‌ భర్తీకి శ్రీకారం చుట్టిన విష‌యం తెల్సిందే.

TSPSC : గ్రూప్‌-2, 3 నోటిఫికేష‌న్ల‌కు స‌ర్వం సిద్ధం.. ఏ క్ష‌ణంలోనైనా..

25 శాఖల్లో.. 9,168 పోస్టులు భ‌ర్తీకి..

tspsc latest news

టీఎస్‌పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 శాఖల్లో.. జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్, జూనియర్‌ ఆడిటర్, వార్డ్‌ ఆఫీసర్‌ హోదాల్లో.. 9,168 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నది. గ్రూప్‌-1,2,3 సర్వీసులకు పోటీ పడే ప్రతి ఒక్కరూ గ్రూప్‌-4కు కూడా హాజరవుతారని చెబుతున్నారు. గ‌తంలో 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్‌ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. అలాగే పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్‌-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈసారి ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో దాదాపు 10ల‌క్ష‌ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.

TSPSC & APPSC Groups : General Science Important Topics in Telugu | Science & Technology Important Topics in Telugu

ప‌రీక్షావిధానం ఇలా..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4ను రెండు పేపర్లుగా.. 300 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.  ఇందులో పేపర్‌ 1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, అలాగే పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 23 Dec 2022 10:11AM
PDF

Photo Stories