TSPSC : గ్రూప్-2, 3 నోటిఫికేషన్లకు సర్వం సిద్ధం.. ఏ క్షణంలోనైనా..
వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించిన టీఎస్‌పీఎస్సీ పరిశీలన ప్రక్రియను పూర్తిచేసింది. ఏ క్షణమైన ఈ రెండు నోటిఫికేషన్లులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. తొలుత గ్రూప్-2లో 663 పోస్టులను గుర్తించిన ప్రభుత్వం ఆమేరకు ఆగస్టు 30న జీవో జారీచేసింది. అయితే గ్రూప్-2 స్థాయి కలిగిన మరో 120 ఉద్యోగాలను కూడా తాజాగా ఇందులో చేర్చి మొత్తంగా 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయనున్నారు. కొత్తగా వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 43 పోస్టులు, శిశు, సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు సుమారు 70 పోస్టులు ఇందులో ఉన్నాయి.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
1500 గ్రూప్-3 ఉద్యోగాలకు..
అలాగే గ్రూప్-3లో కూడా 1,373 పోస్టులు భర్తీ చేయాలని గుర్తించిన ప్రభుత్వం ఆమేరకు ఆగస్టు 30న జీవో జారీ చేసిన విషయం తెల్సిందే. గ్రూప్-3 స్థాయి మరికొన్ని ఉద్యోగాలను కూడా పరిశీలించి వీటికి అదనంగా చేర్చినట్టు తెలుస్తోంది. సంక్షేమ శాఖ, ఇతర శాఖల్లో అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులు దాదాపు 120 వరకు జత చేయనున్నారు. మొత్తం 1500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
చదవండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్-4 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..