Skip to main content

TGPSC Group 3 Exam: గ్రూప్‌–3 పరీక్షలకు ఏర్పాట్లు

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో గ్రూప్‌– 3 పరీక్షలకు 17వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు.
Arrangements for Group 3 Examinations

మొత్తం 49 పరీక్ష కేంద్రాలను గుర్తించామన్నారు. శుక్రవారం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కలసి ఆమె హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే అధికారులు ఈ కేంద్రాలను సందర్శించి వసతి సదుపాయాలను పరిశీలించినట్లు తెలిపారు.

గ్రూప్‌–3 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఇతర మెటీరియల్‌ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భద్రపరిచేందుకు రెండు స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామని, అవసరమైతే ఇతర శాఖల సహకారం తీసుకుంటామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఏటీసీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

యువతలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాల (ఏటీసీ)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ క్రాంతి సూచించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సంజయ్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె హాజరయ్యారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాలు వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రాలలో శిక్షణ కొరకు ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో భాగంగా సంగారెడ్డి, హత్నూర ఐటీఐ కళాశాలను గుర్తించి ఏటీసీలుగా అప్‌ గ్రేడ్‌ చేశామన్నారు. అక్టోబర్ 31 వరకు అర్హులైన, ఆసక్తిగల విద్యార్థులు ప్రవేశాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Published date : 23 Oct 2024 09:17AM

Photo Stories