TSPSC Group 2 Exam Postponed 2023 Updates : బ్రేకింగ్ న్యూస్.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష వాయిదా.. మళ్లీ పరీక్ష ఎప్పుడంటే..?
టీఎస్‌పీఎస్సీతో చర్చించాలని సీఎస్‌కు సూచించారు. లక్షలాది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. భవిష్యత్‌లో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్‌కు సూచించారు. అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని సీఎం చెప్పినట్టు మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సీఎస్ శాంతికుమారి ప్రకటించారు.
త్వరలోనే రీషెడ్యూల్ తేదీలను..
ఎట్టకేలకు గ్రూప్ 2 అభ్యర్థులు, ప్రతిపక్షాల పోరాటం ఫలించింది. తాజా నిర్ణయంతో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. త్వరలోనే రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించనుంది. భవిష్యత్తులో కమిషన్ విడుదల చేసే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించేలా కాకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా ప్లాన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
టీఎస్‌పీఎస్సీతో చర్చించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలా ప్లాన్ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అర్హులైన అందరు అభ్యర్థులు అన్ని పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ సూచించారు. ఈ గ్రూప్-2 పరీక్ష తిరిగి నవంబర్ జరిగే అవకాశం ఉంది.
వరుస పరీక్షలతో సతమతంతోనే..
ఇప్పటికే ఆగస్టు 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. గ్రూప్-2 పరీక్షకు.. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
ఒకే నెలలో గ్రూప్-2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రూప్-2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
Tags
- TSPSC Group 2 Postponed news 2023
- kcr tspsc group 2 exam postponed 2023
- tspsc group 2 exam schedule changes
- ts cs santha kumari tspsc group 2 exam postponed
- tspsc group 2 exam postponed news updates
- ktr twitter on tspsc group 2 exam postponed
- ktr tsspc group 2
- kcr tspsc group 2 news telugu
- tspsc group 2 postponed news in telugu