Success Story : ఫస్ట్ అటెంప్ట్‌లోనే.. గ్రూప్–1 ఉద్యోగం కొట్టానిలా..
ఉన్నత విద్యావంతులైన వారినే స్ఫూర్తిగా తీసుకున్నాడు వారి కుమారుడు. వీరు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. అకుంఠిత దీక్షతో సాగిన ఈ మహాయజ్ఞంలో గ్రూప్–1 విజేతగా నిలిచాడు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కేడర్‌లో ఉద్యోగానికి అర్హత సాధించిన అతనే.. అనంతపురానికి చెందిన ఎస్.భరత్ నాయక్.
Mother & Daughter: ఒకేసారి తల్లీ కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారిలా..
కుటుంబ నేపథ్యం:
అనంతపురంలోని శారదనగర్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్ .శంకర్‌నాయక్... శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెరికల్చర్ విభాగాధిపతి. తల్లి శాంతాబాయి.. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా ఖజానా అధికారిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు భరత్ నాయక్.
ఎడ్యుకేషన్:
భరత్ నాయక్ పదో తరగతి వరకు స్థానిక ఎల్‌ఆర్‌జీ స్కూల్‌లో చదువుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి, అనంత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సివిల్స్ సాధనే లక్ష్యంగా ఎంచుకున్న అతను.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లో చేరారు.
Inspiring Story: ఎన్నో అవమానాలు.. అవహేళనలు ఎదుర్కొన్ని తహశీల్దార్ అయ్యానిలా..
తొలి ప్రయత్నంలోనే.. గ్రూప్-1
డాక్టర్‌గా ప్రొఫెషనల్ కెరీర్ ఉన్నప్పటికీ, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ సాధనే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్న తరుణంలోనే 2016లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడింది. దానిని చూసిన భరత్‌నాయక్.. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దరఖాస్తు చేసుకున్నారు. 2017లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఇంటర్వ్యూల్లో నెగ్గారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
Shiva Kumar goud, DSP: ఆ ఒకే ఒక్క మార్కే..నా జీవితాన్ని మార్చిందిలా..
ఎట్టి పరిస్థిల్లోనూ..
ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు చేరిన భరత్ నాయక్.. శిక్షణ తరగతులతో కలిపి రోజూ దాదాపు పది గంటల పాటు ప్రశ్న పత్రాలపై సాధన చేసేవారు. ఎలాంటి పరిస్థిల్లోనూ ఒత్తిళ్లకులోను కాకుండా లక్ష్య సాధనలో శ్రమించారు. నిత్యం వార్త పత్రికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. సిలబస్ అనుగుణంగా సన్నద్ధమయ్యారు.
నా లక్ష్యం ఇదే..
ఎంబీబీఎస్ చేస్తున్నపుడే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలపై అవగాహన పొందుతూ వచ్చాను. ఎంబీబీఎస్ తర్వాత శిక్షణ ప్రారంభించాను. తల్లిదండ్రుల అంగీకారంతో పట్టుదలతో చదివి ఈ స్థానానికి చేరుకున్నాను. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా, ప్రయత్నిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు సాధించడమే నా ముందున్న లక్ష్యం. సివిల్స్ సాధించితీరుతా.
Y.Obulesh, Group 1 Ranker : ప్రభుత్వ స్కూల్‌లో చదివా...ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
తమ్ముడు భార్గవ్‌నాయక్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చేస్తున్న సమయంలో.. గ్రూప్–1లో మేథమేటిక్స్ పేపరు క్లిష్టంగా ఉండటంతో రెండు నెలల పాటు తమ్ముడి వద్ద ప్రత్యేక శిక్షణ పొందాను. సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లోని గ్రూప్-1 మెటీరియల్ దోహదపడింది. ఇతరులతో మనం ఎపుడూ పోల్చుకోకూడదు. ఇంటర్వ్యూలో భారత్–చైనా– అమెరికా సంబంధాల గురించి అడిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పురోగతి గురించి వివరించమన్నారు.
– ఎస్.భరత్ నాయక్, గ్రూప్–1 విజేత
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...