APPSC Group-1 Ranker Success : గ్రూపు–1 సక్సెస్ సాధించానిలా.. ఎప్పటికైనా నా లక్ష్యం ఇదే..
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–1 (2018) ఫైనల్ ఎంపిక జాబితాను విడుదల చేసింది. 2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్–1లో మంచి ర్యాంక్ సాధించి జిల్లా రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికైన భార్గవ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం:
వైఎస్సార్ జిల్లా ఎర్రముక్కపల్లెకు చెందిన యువకుడు భార్గవ్ గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటి జిల్లా రిజిస్టార్ ఉద్యోగం సాధించాడు. ఇతని తల్లిదండ్రులు సూర్యుడు, ఆదిలక్ష్మిలది పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామం. అయితే ఇతని తండ్రి ఉద్యోగరీత్యా కడపలో స్థిరపడ్డారు.
ఎడ్యుకేషన్ :
భార్గవ్ 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ మాత్రం హైదరాబాదులోని శ్రీచైతన్యలో చదివాడు. ఇంజినీరింగ్‌ను కడపలోని కేఎస్‌ఆర్‌ఎంలో పూర్తి చేశారు.
Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..
ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. గ్రూప్-1కి..
హైదరాబాదులో శాప్ కన్సెల్టెంట్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. 2018లో గ్రూపు–1 పరీక్షకు సిద్ధం అయ్యారు. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి ఇటీవల వెలువడిన ఫలితాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టుకు ఎంపికయ్యారు.
ఎన్నో అవమానాలు.. అవహేళనలు ఎదుర్కొన్ని తహశీల్దార్ అయ్యానిలా..
నా లక్ష్యం ఇదే..
భవిషత్తులో ఐఏఎస్ సాధించడమే లక్ష్యమని భార్గవ్ చెప్పారు. యువత పట్టుదలతో కృషి చేస్తే గ్రూపు–1, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఈజీగానే విజయం సాధించవచ్చని తెలిపారు. గ్రూప్-1లో ఉద్యోగం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ పట్టుదలతోనే ఐఏఎస్ కొట్టాతానని ధీమావ్యక్తం చేశారు.