APPSC Group-1 Ranker Success Story : నా చిన్నతనంలో లక్ష్యం పెట్టుకున్నా.. కానీ..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్–1లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన దేవరకొండ అఖిల సక్సెస్ స్టోరీ మీకోసం..
Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?
APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?
కుటుంబ నేపథ్యం :
మాది తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. తండ్రి దేవరకొండ దత్త త్రిమూర్తులు, తల్లి కాశీ విశాలాక్షి. మాది తండ్రి వ్యవసాయం చేస్తారు. అఖిల సోదరి ఆప్తమాలజిస్ట్. ప్రస్తుతం ఆమె కాకినాడలో పీజీ చేస్తోంది.
నా చిన్నతనం నుంచే..
ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ల జాబితా(30 మంది)లో చోటు దక్కించుకున్నా. చిన్నతనం నుంచి తన తండ్రి చదువులో తనను పోత్సహిస్తూ.., తనకు పూర్తి భరోసా కల్పించారని తెలిపింది. సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా చిన్నతనం నుంచి తన లక్ష్యమని పేర్కొంది.
మూడు సార్లు సివిల్స్ పరీక్షకు.. హాజరై..
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షకు 2017, 2019, 2021 సంవత్సరాల్లో మెయిన్స్‌కు కూడా హాజరైయ్యాను. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు కూడా హాజరయ్యాను.
Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..
వీరి ప్రొత్సాహాంతోనే..
తాను సాధించిన విజయం వెనుక తన తండ్రి దేవరకొండ దత్త త్రిమూర్తులు, తల్లి కాశీ విశాలాక్షిల ప్రొత్సాహాం ఎంతో ఉందని ఆమె వెల్లడించింది.
Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!
నా లక్ష్యం ఇదే..
గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైనప్పటికి తరిగి యూపీఎస్సీ కూడా రాసి తన లక్ష్యాన్ని ఛేదిస్తానని ధీమా వ్యక్తం చేసింది.
Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..
మహిళలదే హావా.. కానీ
ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు. అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా