Skip to main content

APPSC Group-1 Ranker Success Story : అమ్మ అంగన్‌వాడీ కార్యకర్త.. కొడుకు డిప్యూటీ కలెక్టర్‌.. బిడ్డ విజ‌యం కోసం..

రాష్ట్రంలో గ్రూప్-1 (2018) తుది ఎంపిక జాబితాను Andhra Pradesh Public Service Commission (APPSC) జూలై 5వ తేదీన‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
ఆర్‌.కృష్ణానాయక్‌, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్‌
ఆర్‌.కృష్ణానాయక్‌, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్‌

దీంతో నాలుగేళ్లుగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2018 గ్రూప్‌–1కు సంబంధించి మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. వాటిలో కోర్టు సూచనలతో 2 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేనందున మరో 2 పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం 163 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వీరిలో 67 మంది మహిళలు కాగా 96 మంది పురుషులున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో మంచి ర్యాంక్‌ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైన ఆర్‌.కృష్ణానాయక్‌ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..

కుటుంబ నేప‌థ్యం :
ఆర్‌.కృష్ణానాయక్.. అనంత‌పురం జిల్లా పామిడి మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన వారు. వీరి త‌ల్లి గోవిందమ్మ. అంగన్‌వాడీ కార్యకర్త.   తండ్రి వెంకటేష్‌నాయ‌క్ 15 ఏళ్ల క్రితమే మ‌ర‌ణించారు.

ఎడ్యుకేష‌న్‌..
తిరుపతిలోని విద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ (ఈఈఈ)లో బీటెక్‌ పూర్తి చేశారు. 

Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?

ఉద్యోగం చేస్తూనే.. గ్రూప్స్‌కు..
బీటెక్‌ పూర్తి అయిన వెంట‌నే.. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఏఐఎల్‌)లో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం సాధించారు. అనంతరం జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆ ఉద్యోగంలో కొనసాగుతూనే 2018 గ్రూపు–1 పరీక్ష రాశారు. ఇటీవ‌ల విడుద‌లైన‌ గ్రూప్స్‌-1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై.. గ్రామస్తులు ప్రశంసలు పొందుతున్నారు.

తల్లి సంకల్పంతోనే..
తల్లి గోవిందమ్మ తన కుమారుణ్ని ఉన్నత స్థానంలో చూడాలన్న సంకల్పంతో కష్టపడి చదివించింది. కృష్ణా నాయక్‌ కూడా తల్లి ఆకాంక్షలకు అనుగుణంగానే చదివారు.

☛ Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్‌లో 74వ‌ ర్యాంక్ కొట్టానిలా..

తొలిసారిగా గ్రూప్‌–1..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు.

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

ఇంటర్వ్యూలను మాత్రం..
2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

Published date : 22 Jul 2022 07:40PM

Photo Stories