TSPSC Group 1 Prelims Result Link : గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక మెయిన్స్‌కు అర్హత పొందినవారు..
503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. తొలిసారిగా ప్రిలిమినరీ ‘కీ’తో పాటే ప్రతి ఒక్క అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది.
☛ TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..
ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విధానంలో..
503 గ్రూప్1 ఉద్యోగాలకు అక్టోబర్ 16న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. అదే నెల 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించి, చివరికి 5 ప్రశ్నలను తొలిగించి, నవంబర్ 15న తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఉన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విధానం జనవరి 18వ తేదీన వెల్లడించనున్నారు.
TSPSC గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవే..