Telangana : గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలకు గ్రీన్‌సిగ్నల్.. ఫలితాలు ఎప్పుడంటే..?
స్థానికత అంశంపై తర్వాత విచారణ చేస్తామని చెప్పింది. ఒక్క అభ్యర్థి కారణంగా పూర్తిగా ఫలితాలనే నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఏడో తర గతి నుంచి పీజీ వరకు తెలంగాణలో చదివిన తనకు స్థానికత కోటా వర్తింపజేయకపోవడంపై నిహారిక అనే అభ్యర్థి గతంలో హైకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపి స్థానికతను పరిగణనలో తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీని ఇటీవల ఆదేశించారు.
TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..
చదవండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!
ఈ ఉత్తర్వులపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ కార్తీక్‌తో కూడిన ద్విసభ్య ధర్మాస నం బుధవారం విచారణ చేపట్టింది. ఒక్క అభ్యర్థి స్థానికత వివాదం నేపథ్యంలో ఫలితాలను మొత్తంగా నిలిపివేయడాన్ని తప్పుబట్టింది. టీఎస్‌పీఎస్సీ తరఫున న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపించారు. ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉంటేనే స్థానికత వర్తిస్తుందని, అయితే నిహారిక ఆరో తరగతి ఏపీలో చదివారని, ఈ కార ణంగా ఆమెకు స్థానికత వర్తించదని చెప్పారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల కారణంగా గ్రూప్–1 పరీక్ష రాసిన లక్షలమంది అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోందని నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయాలని నిహారిక తరఫు న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం అభ్యర్థి సమగ్ర వివరాలను నివేదించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. స్థానికత వ్యవహారంపై తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
☛ టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్