TSPSC Group-1 Posts: టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్ –1 పోస్టులు ఇవే..
రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మార్చి 23వ తేదీన (బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసిన వెంటనే ప్రభుత్వ శాఖలు చర్యలు వేగవంతం చేస్తూ వచ్చాయి.
మొట్టమొదటి సారిగా గ్రూప్–1..
మొట్టమొదటిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడం, అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుండటంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్ –1 పోస్టులు ఇలా..
➤జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2
➤అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40
➤అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38
➤ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20
➤ డీఎస్పీ– 91
➤ జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2
➤ బఅసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8
➤డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్–2
➤జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6
➤మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35)
➤ఎంపీడీవో(121)
➤డీపీవో(5)
➤కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48)
➤డిప్యూటీ కలెక్టర్(42)
➤అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26)
➤జిల్లా రిజిస్ట్రార్(5)
➤జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3)
➤ఆర్టీవో(4)
➤ జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2)
మొత్తం: 503