Skip to main content

TSPSC Group-1 competition 2024 : మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులు.. 4.03 లక్షల దరఖాస్తులు.. ఒక్క పోస్టుకు ఎంత మంది పోటీప‌డుతున్నారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) 563 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన‌ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల‌కు మొత్తం మీద 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
 TSPSC Group-1 Recruitment Notification     4.03 Lakh for TSPSC Group-1 Posts   TSPSC Group-1 competition 2024 Details    Telangana Public Service Commission

గ్రూప్‌-1కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు.. మార్చి 23వ తేదీ నుంచి 27వ‌ర‌కు ద‌ర‌ఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం క‌ల్పించారు. ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒక్కొక్క పోస్టుకు ఎంత మంది పోటీప‌డుతున్నారంటే..?
TSPSC 563 గ్రూప్‌-1 పోస్టుల‌కు 4.03 లక్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు దాదాపు 715 మంది అభ్య‌ర్థులు పోటీప‌డుతున్నారు.

టీఎస్‌పీఎస్సీ Group-1 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష 2024 ప‌రీక్ష విధానం :

tspsc group 1 candidates

TSPSC గ్రూప్‌–1 సర్వీసుల ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఒకే పేపర్‌గా నిర్వహిస్తారు. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పేరిట ఈ పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలతో–150 మార్కులకు ప్రిలిమ్స్‌ నిర్వహిస్తారు. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం రెండున్నర గంటలు.

900 మార్కులకు మెయిన్స్ :

tspsc group 1 candidate news in telugu

TSPSC గ్రూప్‌–1 మెయిన్‌ ఎగ్జామినేషన్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఆరు పేపర్లుగా 900 మార్కులకు నిర్వహించనున్నారు. దీంతోపాటు.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ కూడా ఉంటుంది. ఈ పేపర్‌ను కేవలం అర్హత పరీక్షగానే నిర్దేశించారు. జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌) 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 1లో జనరల్‌ ఎస్సే 150 మార్కులకు; పేపర్‌ 2లో హిస్టరీ, కల్చర్‌–జాగ్రఫీ 150 మార్కులకు; పేపర్‌–3లో ఇండియన్‌ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన 150 మార్కులకు; పేపర్‌–4లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ 150 మార్కులకు; పేపర్‌ 5లో సైన్స్‌–టెక్నాలజీ–డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 150 మార్కులకు; పేపర్‌–6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 150 మార్కులకు ఉంటాయి.

Published date : 18 Mar 2024 10:54AM

Photo Stories