TSPSC Group 1 Case : టీఎస్‌పీఎస్సీ తీరుపై హైకోర్టు ఆగ్రహం.. విచారణ వాయిదా.. ఎందుకంటే..?
నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలో ఆడుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 27వ తేదీ (బుధవారం) కి వాయిదా వేసింది.
జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది.
☛➤ టీఎస్‌పీఎస్సీ Group 1 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
11 ఏళ్ల తర్వాత..
వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు.
☛➤ TSPSC Group 1 Prelims- 2023 Exam Question Paper with Key (Click Here)
2022 ఏప్రిల్ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పుడు తాజా తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసిన విషయం తెల్సిందే.
ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమే.. ఎందుకంటే..?
వచ్చే నెలలో అక్టోబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags
- ts high court serious on tspsc
- Telangana High Court Hearing on TSPSC Group1 Prelims Exam
- TSPSC Group-1 prelim exam cancelled
- TSPSC group-1 preliminary gets cancelled yet again
- tspsc group 1 case 2023
- tspsc group 1 case news in telugu
- tspsc group 1 case details in telugu
- tspsc group 1 updates
- tspsc group 1 live updates
- tspsc group 1 live updates news
- tspsc group 1 case updates
- tspsc group 1 case live updates
- Sakshi Education Latest News
- TSPSC Group 1
- Telangana High Court