TSPSC Group 1 Prelims 2022 Key objection : గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' అభ్యంతరాలు ఉంటే తెలియజేయండిలా.. డైరెక్ట్ లింక్ ఇదే..
అలాగే ఈ గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష 'కీ' తో పాటు కొశ్చన్ పేపర్, ఓఎంఆర్ షీట్స్‌లను కూడా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
అభ్యంతరాలు స్వీకరణకు చివరి తేదీ ఇదే..
అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక కీని కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచారు. కేవలం ఈ https://websitenew.tspsc.gov.in/viewKeyObjections ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ మెయిల్, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించే ప్రసక్తి లేదని కూడా పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 2022 'కీ' కోసం క్లిక్ చేయండి
మీ ఓఎంఆర్ షీట్‌లను..
మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ షీట్‌లను అందుబాటులో ఉంచారు. టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గడువు అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 2022 ఓఎంఆర్ షీట్ల డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం అక్టోబర్ 16వ తేదీన 1,019 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు 2,86,051 (75%) మంది దీనికి హాజరయ్యారు.
15 శాతానికిపైగా ప్రశ్నలు..
ప్రశ్నపత్రాన్ని కొందరు UPSC ప్రిలిమ్స్ పరీక్ష స్థాయితో పోల్చగా మరికొందరు అంతకుమించి కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో 100 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తుండగా.. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయమే ఇవ్వడంతో ప్రశ్న చదివి జవాబు రాయడం క్లిష్టంగా మారిందని ఎక్కువ మంది అభ్యర్థులు చెప్పారు.
☛ టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు జవాబుల ఎంపికకు ఎక్కు వ సమయం పట్టిందన్నారు. నాలుగు జవాబుల్లో ఏ ఏ మూడు సరైనవి అంటూ ఇచ్చిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయన్నారు. ఇక రీజనింగ్ విభాగం నుంచి 10 శాతం లోపే ప్రశ్నలు ఉండాల్సి ఉన్నా 15 శాతానికిపైగా ప్రశ్నలు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెంట్ అఫైర్స్‌లో వచ్చిన ప్రశ్నలు లోతైన అంశాలతో అడగటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఒకట్రెండు ప్రశ్నలు ఆంగ్లం, తెలుగులో వేర్వేరు అర్థాలు వచ్చేలా ఉన్నట్లు చెప్పారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ 2022లో ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయంటే..
సబ్జెక్ట్ | మార్కులు | |
1. | ఇండియన్ పాలిటీ & గవర్ననెస్ | 16 |
2. | ఇండియన్ హిస్టరీ | 9 |
3. | తెలంగాణ హిస్టరీ & కల్చర్ | 16 |
4. | జియోగ్రఫీ | 16 |
1. ఇండియా జియోగ్రఫీ (8 మార్కులు) | ||
2. వరల్డ్ జియోగ్రఫీ (3 మార్కులు) | ||
3. తెలంగాణ జియోగ్రఫీ (5 మార్కులు) | ||
5. | ఎకానమీ (ఇండియా & తెలంగాణ) | 5 |
6. | సైన్స్ అండ్ టెక్నాలజీ | 22 |
1.బయాలజీ (8 మార్కులు) | ||
2.ఫిజిక్స్ (4 మార్కులు) | ||
3.కెమిస్ట్రీ (3 మార్కులు) | ||
4.సైన్స్ అండ్ టెక్నాలజీ (7 మార్కులు) | ||
7. | పర్యావరణ శాస్త్రం | 4 |
8. | డిజార్ట్స్ మేనేజ్‌మెంట్ | 3 |
9. | కరెంట్ అఫైర్స్ | 15 |
10 | అంతర్జాతీయ సంబంధాలు | 7 |
11 | సోషల్ ఎక్స్‌క్లూజన్ | 7 |
12. | రిజనింగ్ & డీఐ | 23 |
13 | ఇతరం | 2 |
14. | తెలంగాణ రాజకీయం | 5 |
మొత్తం | 150(మార్కులు) |
TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం, ప్రిపరేషన్.. ఇలా