TSPSC Group I Exam: పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలి
కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 9న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాల్లో 4,699 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ 93986 84240కు ఫోన్ చేయాలని సూచించారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
పరీక్ష కేంద్రాల్లో టేబుల్ డెస్క్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలస్యమైతే అనుమతించబోరని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించా రు.
చీఫ్ సూపరింటెండెంట్‌కు తప్ప ఎవరికీ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్సీవో శ్రీనివాస్, డీఐఈవో మోహన్, డీఈవో రమేశ్‌కుమార్, డీటీవో లక్ష్మణ్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.