TGPSC Group 1 Mains Exams : అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 మెయిన్ పరీక్షలు.. నిరంతరం రివిజన్, రైటింగ్ ప్రాక్టీస్‌తోనే సక్సెస్..
మెయిన్ పరీక్షలను టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి వరుసగా ఏడురోజులపాటు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 50 రోజుల సమయంలో... మెయిన్స్‌లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, సబ్జెక్ట్‌ల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు, రైటింగ్ ప్రాక్టీస్, ముఖ్యమైన టాపిక్స్ తదితర అంశాలపై విశ్లేషణ..
➦ 563–టీజీపీఎస్సీ గ్రూప్–1 పోస్ట్‌ల సంఖ్య.
➦ 3,02,172–తొలి దశ ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య.
➦ 31,382–ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్స్‌కు అర్హత పొందిన వారి సంఖ్య.
➦ అంటే ఒక్కో పోస్ట్‌కు దాదాపు 56 మంది పోటీ పడుతున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు మెయిన్స్‌లో ప్రతిభ చూపడం అత్యంత కీలకంగా మారింది. తీవ్ర పోటీ పరిస్థితుల్లో అభ్యర్థులు అందుబాటులో ఉన్న సమయంలో ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.
Jobs at IISC : ఐఐఎస్‌సీలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు.. ఈ విభాగాల్లోనే..
50 రోజుల సమయం
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు టీజీపీఎస్సీ నిర్వహించనుంది. అంటే అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 50 రోజులు మాత్రమే. ఈ సమయంలో ఆయా పేపర్ల వారీగా ముఖ్యమైన అంశాలను గుర్తిస్తూ.. వాటిని అధ్యయనం చేస్తూ.. రివిజన్‌తోపాటు రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రిపరేష¯Œ సాగించాలి. అప్పుడే పరీక్ష హాల్లో మంచి ప్రతిభ చూపేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు, గత విజేతలు పేర్కొంటున్నారు.
మెయిన్స్ ఆరు పేపర్లు
➦ .మెయిన్ పరీక్షను మొత్తం ఆరు పేపర్లలో 900 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–1 జనరల్ ఎస్సే 150 మార్కులకు, పేపర్–2 హిస్టరీ, కల్చర్–జాగ్రఫీ 150 మార్కులకు, –పేపర్–3 ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన 150 మార్కులకు, పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 150 మార్కులకు, పేపర్–5 సైన్స్–టెక్నాలజీ–డేటా ఇంటర్‌ప్రిటేషన్ 150 మార్కులకు, పేపర్–6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 150 మార్కులకు ఉంటాయి. మొత్తం మెయిన్ ఎగ్జామినేషన్‌కు కేటాయించిన
మార్కులు–900.
➦ పేపర్–ఎ..జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) 150 మార్కులకు ఉంటుంది.
➦ పేపర్–ఎగా పేర్కొన్న జనరల్ ఇంగ్లిష్
అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పొందిన మార్కులను మెరిట్ లిస్ట్ రూపకల్పనలో పరిగణించరు. ఈ పేపర్‌లో కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మిగిలిన పేపర్ల మూల్యాంకన చేస్తారు.
NIT Contract Jobs : వరంగల్ నిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల్లో భర్తీకి దరఖాస్తులు..
కీలకాంశాలపై పట్టు సాధించేలా
➦ మెయిన్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా.. జనరల్ ఎస్సే పేపర్‌లో, హిస్టరీ పేపర్‌లో ఉండే తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, హక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
➦ జనరల్ ఎస్సే పేపర్–1 కోసం సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక వృద్ధి, భారత చారిత్రక, వారసత్వ సంపద, సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
➦ పేపర్–2లో ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారత చరిత్ర,సంస్కృతి అంశాలు, అదే విధంగా తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వ అంశాలను చదవాలి. వీటితోపాటు భారత, రాష్ట్ర భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి.
➦ పేపర్–3 కోసం భారత రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, భారత సమాజం, సమస్యలు, సాంఘిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి.
➦ పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ కోసం భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి, అభివృద్ధి, పర్యావరణ సమస్యలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
➦ పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం సామాజిక అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ దోహద పడుతున్న తీరు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పద్ధతుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి.
ఆరో పేపర్‌కు ప్రత్యేకంగా
గ్రూప్–1 మెయిన్‌లో ఆరో పేపర్‌గా పేర్కొన్న.. తెలంగాణ ఆలోచన (1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
Schools And Colleges Holiday: భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. పరీక్షలు వాయిదా
కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం
మెయిన్స్ ప్రిపరేషన్ క్రమంలో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా.. తెలంగాణకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై మరింత ప్రత్యేక దృష్టితో అభ్యసనం సాగించాలి. ఆర్థిక వనరుల అభివృద్ధి, రాష్ట్రంలో వ్యవసాయ, సాగు పరిస్థితులు, పారిశ్రామిక విధానాలు వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ప్రత్యేక అంశాలకు ఇలా
➦ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీలపై అభ్యర్థులు లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మార్కులు పెంచుకునే అవకాశం ఉంది.
➦ చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
➦ జాగ్రఫీలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం.
➦ ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన ఏర్పరచుకోవాలి.
School Holidays: నేడు విద్యాసంస్థలకు సెలవు
పునశ్చరణకు ప్రాధాన్యం
➦ ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పునశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో కొత్త అంశాల అధ్యయనం జోలికి వెళ్లకుండా ఇప్పటికే పట్టు సాధించిన అంశాలపై మరింత అవగాహన పొందేందుకు కృషి చేయాలి.
➦ అందుకోసం పేపర్ వారీగా రోజు వారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకుంటే 50 రోజుల వ్యవధి అందుబాటులో ఉంది.
ఈ వ్యవధిలో అభ్యర్థులు ప్రతి రోజు అన్ని పేపర్లను చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి పేపర్‌కు సగటున రెండున్నర గంటల సమయం కేటాయించేలా చూసుకోవాలి. తమకు సులభం అనిపించే పేపర్లకు కొంచెం తక్కువ సమయం కేటాయించి, ఆ సమయాన్ని క్లిష్టంగా భావించే పేపర్లకు కేటాయించాలి. దీనివల్ల పేపర్లు, అంశాలపై పట్టు విషయంలో సమతుల్యత పాటించే అవకాశం లభిస్తుంది.
చివరి వారం రెడీ రెకనర్స్
పరీక్షకు ముందు వారం రోజుల నుంచి అభ్యర్థులు పుస్తకాల జోలికి వెళ్లకుండా రెడీ రెకనర్స్‌ను వినియోగించి ప్రిపరేషన్ సాగించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో రాసుకున్న సొంత నోట్స్ మేలు చేస్తుంది. అదే విధంగా ఆయా టాపిక్స్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌లో ఉండే సబ్ హెడింగ్స్‌ను పరిశీలించాలి.
రైటింగ్ ప్రాక్టీస్
మెయిన్స్ అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు తాము చదివిన టాపిక్‌కు సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం రాయడం అలవర్చుకోవాలి. అదే విధంగా పరీక్ష హాల్లో ప్రతి ప్రశ్నకు సగటున లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి రోజు ఒక ప్రశ్నకు ఆ సమయం ఆధారంగా సమాధానాలు రాయాలి. ఆ తర్వాత వాటిని మూల్యాంకన చేసుకుని అన్ని పాయింట్లు రాశామా లేదా అని తెలుసుకోవాలి.
Tags
- TGPSC Group 1
- Mains Exams
- Group 1 mains exams
- october
- Preparation Tips
- tgpsc mains syllabus
- tgpsc group 1 mains candidates
- Government Jobs
- Telangana Govt
- tgpsc group 1 mains exams
- preparations for group 1 mains exams
- Education News
- Sakshi Education News
- TGPSC Group-1 2024
- TGPSC Group-1 mains
- TGPSC exam preparation
- TGPSC Group-1 study guide
- TGPSC Group-1 exam schedule October 2024
- TGPSC Group-1 important topics
- TGPSC Group-1 subject focus
- TGPSC Group-1 exam tips and strategies
- SakshiEducationUpdates