TSPSC Group 1: గ్రూప్–1 దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..
క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల నుంచి భారీ స్పందన లేకపోవడంతో మరో అవకాశం ఇచ్చే దిశగా టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ మార్చి 14న ఒక ప్రకటనలో వెల్లడించారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి గత నెలలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. మార్చి 14న వచ్చిన దరఖాస్తులు 3లక్షల లోపే ఉన్నాయి.
2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు 3.80 లక్షల దరఖాస్తులు వచ్చా యి. నాటి అభ్యర్థుల్లో చాలామంది ఇప్పుడు దరఖాస్తులు సమర్పించలేదని తెలుస్తోంది. దీంతో గడువు తేదీని మార్చి 16 వరకు పొడిగి స్తున్నట్లు ప్రకటించారు.