TSPSC: బిగ్ బ్రేకింగ్... యథాతథంగా గ్రూప్ 1 పరీక్ష... వాయిదా అవసరం లేదన్న హైకోర్టు
ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఈనెల 11న జరగనుంది.
చదవండి: After Class 12th: టీచింగ్ అంటే ఇష్టమా... అయితే ఇంటర్ తర్వాత మీరు ఈ కోర్సులు చేయడం బెస్ట్
2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. పేపర్ లీకేజీ కారణంతో ఈ పరీక్షను రద్దు చేసి ఈనెల 11న నిర్వహించనున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ‘సిట్’తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, యూపీఎస్సీ లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు.
చదవండి: మెడిసిన్ విద్యార్థులకు అలర్ట్... 150 మెడికల్ కాలేజీల అనుమతులు రద్దు..!
గత ఏడాది అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతోపాటు జూన్ 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జారీచేసిన వెబ్‌నోట్‌ను రద్దు చేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్ అయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్ చేసిందని, ఈ సంఖ్య 100కు చేరవచ్చన్నారు.
చదవండి: MBBS Seats: విద్యార్థులకు గుడ్ న్యూస్... ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు