Medical colleges derecognised: మెడిసిన్ విద్యార్థులకు అలర్ట్... 150 మెడికల్ కాలేజీల అనుమతులు రద్దు..!
ఇప్పటివరకు అధికారికంగా 40 కాలేజీల అనుమతులను రద్దు చేశారు. ఇందులో సుజనా చౌదరికి చెందిన మెడికల్ కాలేజీ ఉంది.
చదవండి: MBBS Seats: విద్యార్థులకు గుడ్ న్యూస్... ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు
40 మెడికల్ కళాశాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్ఎంసీ నిబంధనలు పాటించని మరో 150 కాలేజీలను గుర్తించారు. త్వరలోనే వీటి అనుమతులు కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపారు. మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా ఎన్ఎంసీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
చదవండి: ముగిసిన నీట్ ఎగ్జామ్.. కీ కోసం క్లిక్ చేయండి
కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేకపోవడం, సౌకర్యాలు కల్పించకపోవడాన్ని ఎన్ఎంసీ అధికారులు గుర్తించారు. నిబంధనలు పాటించని కాలేజీల అనుమతులను రద్దు చేసే అధికారం నేషనల్ మెడికల్ కమిషన్ కు ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నామని కమిషన్ ముందు నిరూపించుకుంటేనే ఇప్పుడు గుర్తింపు కోల్పోయిన కళాశాలలు తిరిగి గుర్తింపు పొందుతాయి.
గుర్తింపు కోల్పోయిన మెడికల్ కాలేజీలు గుజరాత్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్లు సమాచారం. కమిషన్‌కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నెల రోజులుగా నిర్వహించిన తనిఖీలో సీసీటీవీ కెమెరాలు పని చేయకపోవడం, ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ హాజరు విధానాల్లో లోపాలు, ఫ్యాకల్టీ రోల్స్‌లో లోపాలు బయటపడ్డాయి.
Telangana Medical Seats: తెలంగాణలో 700 మెడికల్ సీట్లు పెరిగే చాన్స్
గుర్తింపు కోల్పోయిన మెడికల్ కాలేజీలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని మెడికల్ కమిషన్ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 2014 నుంచి వైద్య కళాశాలల సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది. 2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2023లో ఈ సంఖ్య 654కి పెరిగింది.
చదవండి: నర్సింగ్ విద్యకు అంతర్జాతీయ డిమాండ్
అలాగే 2014కు ముందు దేశ వ్యాప్తంగా 51,348గా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ప్రస్తుతం 99,763కు, పీజీ సీట్లు 2014కు ముందు 31,185 ఉండగా ప్రస్తుతం 64,559కి పెరిగాయి.