నర్సింగ్ విద్యకు అంతర్జాతీయ డిమాండ్
Sakshi Education
కొత్త మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణకు రూ.6,500 కోట్లు కేటాయించారని గవర్నర్ వివరించారు.
కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు రాబోతున్నాయని, మనదేశంలో నర్సింగ్ విద్యకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ రంగం మరింత వృద్ధి చెందిందన్నారు. బడ్జెట్‌సహా వివిధ అంశాలపై సమావేశానికి వచ్చిన ప్రముఖులు వ్యాసాలు రాసి పంపితే వాటిని పుస్తకరూపంలో ప్రచురిస్తామని గవర్నర్ తెలిపారు.
చదవండి: EAMCET: పరిధిలోకి ఈ కోర్సులు
బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఈ దశాబ్దకాలంలో దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 87 శాతం, పీజీ మెడికల్ సీట్లు 105 శాతం, మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యాయన్నారు. సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, జాతీయ పోషకా హార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Admission: నైటింగేల్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి
Published date : 10 Feb 2023 03:02PM