EAMCET: పరిధిలోకి ఈ కోర్సులు
బీఎస్సీ నర్సింగ్ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీచేయాలని 2021లో నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలిచ్చింది. దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలు వచ్చేసరికే ప్రవేశాలు పూర్తికావడంతో ఆ ఒక్క ఏడాది మినహాయింపునిచ్చింది. 2022లో ఎంసెట్‌లో చేర్చినా.. సీట్లు నిండకపోవడంతో ఎంసెట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండానే మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీచేశారు.
చదవండి: ఎంసెట్ - | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS |
తాజాగా ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన తరుణంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రికి లేఖ రాశారు. ఎంసెట్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సును సైతం చేర్చాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 85 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680, ప్రైవేట్ కాలేజీల్లో సుమారు 5వేల సీట్లున్నాయి. ఈ సీట్లను ఎంసెట్ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు.
చదవండి: Admission: నైటింగేల్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి