Skip to main content

Group I: ప్రిలిమ్స్‌ రద్దు చేయకుంటే ఆమరణ దీక్ష

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేకుంటే 48 గంటల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు.
Group I
గ్రూప్–1 ప్రిలిమ్స్‌ రద్దు చేయకుంటే ఆమరణ దీక్ష

మార్చి 15న వికారాబాద్‌ జిల్లా పరిగిలో భీమ్‌ దీక్షను ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షతో పాటు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి హయాంలో నిర్వహించిన పరీక్షల నిర్వాకాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహరంపై రాష్ట్రపతి, గవర్నర్‌కు లేఖ రాస్తానని తెలిపారు. స్వచ్ఛందంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: TSPSC: పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి

సీఎం కేసీఆర్‌ ఈ విషయమై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ట్వీట్‌ చేసే మంత్రి కేటీఆర్‌ ఈ విషయమై స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్‌కు వచి్చన ప్రవీణ్‌కుమార్‌ స్థానిక ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమవేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కాంకు సంబంధించి కేసీఆర్‌ కుటుంబం మీద అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.

చదవండి: TSPSC: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై ‘లీకేజీ’ ఒత్తిడి.. ఈ పరీక్ష రద్దు

Published date : 16 Mar 2023 01:02PM

Photo Stories