Driving Licence : ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే..ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండిలా.
ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడంతో సహా 18 సేవలను ఆన్‌లైన్ ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆధార్ ప్రామాణీకరణత గల కొన్ని సేవలు ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు 3 వారాల తర్వాత తీసుకోని రానున్నారు. ప్రస్తుతం పరివాహన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పునరుద్ధరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసే విధానం..
➤ దశ 1: పరివహన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ parivahan.gov.in లేదా మీ రాష్ట్ర సంబంధిత ఆర్టీఓ వెబ్‌సైట్ కు వెళ్లండి.
➤ దశ 2: పోర్టల్‌లోని కనిపించే “ఆన్‌లైన్ సర్వీస్” విభాగంలో గల “డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు” ఎంచుకోండి.
➤ దశ 3: ఇప్పుడు క్రొత్త విండో ఓపెన్ అవుతుంది, అక్కడ మీ రాష్ట్ర పేరును ఎంచుకోవాలి.
➤ దశ 4: ఆపై డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సేవలను ఎంచుకోండి.
➤ దశ 5: ఇప్పుడు, మీ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలో మీకు సూచనలు వస్తాయి. వాటిని పూర్తిగా చదివిన తర్వాత 'కొనసాగింపు'పై క్లిక్ చేయండి.
➤ దశ 6: మీ పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్‌కోడ్, ఇతర వివరాలు దగ్గర పెట్టుకోండి
➤ దశ 7: ఇప్పుడు మీ వ్యక్తిగత లేదా వాహన సంబంధిత వివరాలను నింపండి.
➤ దశ 8: తర్వాత మీ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
➤ దశ 9: మీరు ఈ ప్రక్రియ పూర్తీ చేశాక మీరు మీ అప్లికేషన్ ఐడిని చూడగలిగే రసీదు పేజీ కనిపిస్తుంది. అలాగే, మీకు అన్ని వివరాలతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది.
➤ దశ 10: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఛార్జీని ఆన్‌లైన్ ద్వారా లేదా కార్యాలయానికి వెళ్లి చెల్లించవచ్చు.
ఆన్‌లైన్‌లో లభించే ఇతర సేవలు..
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీఓ కార్యాలయాలు అందించే ముఖ్యమైన సేవలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో ద్వారా పొందవచ్చు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు 18 రకాల సేవలను ఆధార్ అనుసంధానం ద్వారా వినియోగించుకునేలా మార్పులు చేసింది. ఈ సేవల కోసం ఆర్టీఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులో అడ్రస్ మార్పు, ఆర్ సీ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వంటివి ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
కొత్త డ్రైవింగ్ లైసెన్సుల కోసం...
ఆన్‌లైన్‌లో లభించే ఇతర సేవలలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్‌ఓసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు, మోటారు వాహన యాజమాన్య బదిలీ నోటీసు, మోటారు వాహన యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి దరఖాస్తు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో చిరునామా, డ్రైవర్ శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రం, దౌత్య అధికారి మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, దౌత్య అధికారి మోటారు వాహనం తాజా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, లీజు-కొనుగోలు ఒప్పందానికి ఆమోదం, లీజు-కొనుగోలు ఒప్పందాన్ని వంటివి ఉన్నాయి. ఈ ప్రక్రియలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి, ఆర్టీఓల వద్ద రద్దీని తగ్గించడానికి ఆన్‌లైన్‌లో సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రం తెలిపింది. కొత్త డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడంలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరని మంత్రిత్వ శాఖ ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
చదవండి :
How To Apply Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేసుకోండి..
ATM card Alert : ఏటీఎం కార్డు పోతే...వెంటనే ఇలా చేయండి..!
Pancard : మీ పాన్ కార్డ్ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!
Aadhar Card Address Change : ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..
Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..