Women in Forbes List: జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన మహిళలు.. వారి స్థానాలు ఇవే
అత్యధిక సంపాదనతో..
టేలర్ స్విఫ్ట్: ఈ సంవత్సరం వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో టేలర్ స్విఫ్ట్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టేలర్ స్విఫ్ట్ బిలియనీర్‌గా మారారు. టేలర్ స్విఫ్ట్ పేరొందిన సింగర్. ఆమె తన పాటలు, నటన ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన మొదటి మహిళగా నిలిచారు. టేలర్ స్విఫ్ట్ తన పాటలు, రాయల్టీల ద్వారా 500 మిలియన్ డాలర్లు (ఒక మిలియన్ అంటే రూ. 10 లక్షలు) సంపాదించారు.
ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా..
జార్జియా మెలోని: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ఏడాది వార్తల్లో కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో మెలోని నాల్గవ స్థానంలో నిలిచారు. 2022, అక్టోబరు 22న మెలోని ఇటలీ పగ్గాలు చేపట్టారు. మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధానమంత్రి. మెలోని 2014 నుండి ఇటలీ రైట్ వింగ్ పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు.
ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానం..
కమలా హారిస్: ఈ మహళ కూడా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. కమలా హారిస్ అమెరికాకు చెందిన మొదటి నల్లజాతి మొదటి మహిళ. అలాగే ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి దక్షిణాసియా అమెరికన్. 2021 జనవరి 20న కమలా హారిస్ యూఎస్‌ఏ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు.
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలిగా..
క్రిస్టీన్ లగార్డ్: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు క్రిస్టీన్ లగార్డ్. ఈ ఉన్నత పదవిని చేపట్టిన మొదటి మహిళ క్రిస్టీన్ లగార్డ్. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. యూరో జోన్ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించేందుకు ఆమె ప్రయత్నించారు.
అత్యంత శక్తివంతమైన మహిళగా..
ఉర్సులా వాన్: ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్లేయెన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఉర్సులా వాన్ డెర్లేయెన్ 2019, జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ. ఉర్సులా వాన్ డెర్లేయన్ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరొందారు.