Ayodhya Ram Mandir Facts: అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇవే..
జనవరి 22న 2024, సోమవారం ఉదయం అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ వేడుకలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన హోస్ట్‌గా విచ్చేయనున్నారు. మరెంతోమంది సినీ తారలు, క్రీడాకారులు, మరికొందరు ముఖ్యఅతిథులతోపాటు కొందరు భక్తులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో జరిగే ఉత్సవాలు సోమవారం జనవరి 22న అయితే, 23వ తేదీన భక్తులకు దర్శనం చేసునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Ayodhya: ‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి.. వివరాలు వెల్లడించిన ట్రస్ట్
అయోధ్యలో రామ మందిరం గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్రింది కథనాన్ని చదవండి..
రామ మందిరం ప్రాముఖ్యత:
ఈ అయోధ్య రామమందిరాన్ని హిందువులు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇక్కడికి వేలాది మంది భక్తులు సందర్శించేందుకు ఎదురుచూస్తున్నారు. దీనిని, హిందువులు రాముని జన్మస్థలంగా పరిగణిస్తారు. ఆగస్టు 5, 2020లో ఈ మందీరానికి శంకుస్తాపన ప్రధాని నరేంద్ర మోదీ చేత చేయించారు. ప్రస్తుతం, దీని తయారీ పూర్తి కాకపోయినప్పటికీ మందీరంలో శ్రీరాముని విగ్రహాన్ని సోమవారం ఘనంగా ప్రతిష్టించనున్నారు.
Ayodhya Ram Temple : జనవరి 14న అయోధ్య రామాలయ ప్రతిష్టాపన
మందిరాన్ని పర్యవేక్షించేది:
సుప్రిం కోర్టు ఆదేశాల మెరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ 'శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం' ఈ మందీరాన్ని పర్యవేక్షిస్తారు. ఈ నిర్మాణాన్ని లార్సెన్ అండ్ టుర్బో చేపట్టింది.
New Airport for Ayodhya: అయోద్య ఎయిర్‌పోర్ట్‌కు పేరు సిద్ధం..!
అయోధ్య మందిరానికి చేరుకునేది:
సరయూ నది ఒడ్డున నిర్మించిన ఈ మందిరానికి చేరుకునేందుకు అయోధ్యలో కావాల్సిన వాహనాలు లభిస్తాయి. సైకిల్ రిక్షా లేదా ఆటో రిక్షాల సహకారంతో భక్తులు మందిరానికి చేరుకోగలరు. నది ఒడ్డు కారణంగా ఈ ప్రయాణం మీకు ప్రశాంతమైన నేపథ్యాన్ని అందిస్తుంది.
Ram Mandir Pran Pratishtha: అమెరికాలో… శ్రీరామ మందిర ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం
హారతి సమయం:
భక్తులకు హారతిలో పాల్గొనేందుకు ట్రస్ట్ నుంచి లభించే పాసులను పొందాల్సి ఉంటుంది. దీనిని కేవలం మీ ఐడీ ప్రూఫ్‌తో మాత్రమే పొందగలరు. హారతి సమయానుసారం..
1. ఉదయాన్నే.. 6:30ని జాగర హారతి (లేదా) సింగార హారతి.
2. మధ్యాహ్నం.. 12 గంటలకు భోగ్ హారతి.
3. సాయంత్రం 7:30ని సంధ్యా హారతి.
Ayodhya Ram Mandir: శ్రీరామ మందీరం నిర్మాణంలో ఉపయోగించినవి ఇవే..
దర్శన సమయం:
మొదట ఉదయం.. 7గంటల నుంచి 11:30 వరకు. తిరిగి మధ్యాహ్నం.. 2 నుంచి 7గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం కోసం మందిరానికి సందర్శించవచ్చు.
దర్శనానికి ప్రవేశ రుసుము:
భక్తులకు రోజువారి దర్శనానికి ఎటువంటి రుసుము చెలాయించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రతిరోజు జరిగే మూడు రకాల హారతులకు మాత్రం పాసులు తీసుకున్న భక్తులకే ప్రవేశం ఉంటుంది. అది కూడా ఒక్కో రౌండ్‌కు 30 మంది మాత్రమే రావాల్సి ఉంటుంది.
శ్రీరాముని విగ్రహ ప్రత్యేకతలు:
కర్ణాటకాకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రాముని విగ్రహాన్ని అతి చిన్న వయసులోనే తయారు చేశాడు. ఇతని కుటుంబ నేపథ్యంలో ఐదు తరాల వారు మైసూర్‌లో ప్రసిద్ధ శిల్పులు అని పేరు ఉంది.
అరుణ్ తక్కవ కాలంలోనే తన ఎంబీఏ చదువును పూర్తి చేసి కార్పొదేట్ ప్రపంచంలో పనిచేశాడు. అయినా కూడా తిరిగి 2008లో మళ్లీ తన శిల్పకళను ప్రారంభించాడు.
Ram-Mandir Lock: రామ మందిరానికి కానుకగా తాళం-చెవి.. మరి దాని బరువు ఎంత..? చేసిన వారు..!
శ్రీరామ మందిరంలో స్థాపించాల్సిన ఈ విగ్రహం 51 అంగుళాల పొడవుతోపాటు 5 ఏళ్ల బాలుడి పోలి ఉంటుంది. విగ్రహం గురించి మందీర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. రాముని విగ్రహమే కాదు, సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహంతోపాటు హనుమంతుని విగ్రహాన్ని కూడా నల్లరాతితో తయారు చేయబడింది. దీని కారణంగా విగ్రహానికి ఎటువంటి అభిషేకాలను నిర్వహించినా.. ఆ విగ్రహానికి ఉన్న అందం కళ చెరగదు. విగ్రహం చెడిపోకుండ ఉండేలా చర్యలు తీసుకొని దానిని తయారు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠలో లక్ష్మణుడు, సీత, హనుమంతుని విగ్రహాలతోపాటు రాముని విగ్రహం కూడా ఆలయ నేల స్థాయిలో స్థాపించనున్నారు. ఇదిలా ఉంటె, రాముని సోదరుల విగ్రహాలను మొదటి అంతస్తులో స్థాపించనున్నట్లు తెలిపారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
నిర్మాణానికి ఖర్చు:
అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరానికి ఇప్పటికే కోట్లల్లో ఖర్చైంది. నిర్మాణాన్ని పర్యావేక్షించే ట్రస్ట్ అనుసారం మొత్తంగా 1,800 కోట్లు అని తెలిపారు. నిర్మాణ ఖర్చులు, మెటీరియల్, యంత్రాలు, కార్మికులకు చెలాయించాల్సిన మొత్తంతోపాటు ఇతర పరిపాలనా ఖర్చులు ఇందులో కలుస్తాయి. అక్టోబర్‌లో విడుదల చేసిన పీటీఐ రిపోర్ట్ అనుసారం గతేడాది ఫిబ్రవరి 5, 2020 నుంచి మార్చి 31, 2023వరకు ట్రస్ట్ చేత 900కోట్లు ఖర్చు జరిగినట్లు వెల్లడైంది.
మరిన్ని వివరాలు:
మందిరంలో శ్రీరాముని విగ్రహం ఉండగా.. నాలుగు మూలాల్లో ఇతర విగ్రహాలను స్థాపించేందుకు సిద్ధమైయ్యారు. అవే.. సిద్ధి వినాయకుని విగ్రహం, మహా శంకరుని విగ్రహం, సూర్య భగవానుని విగ్రహంతోపాటు దేవి భగవతి విగ్రహం. ఉత్తరాది దిక్కున దేవి అన్నపూర్ణ విగ్రహం ఉంటె, దక్షణాది దిక్కున హనుమంతుని మందిరాన్ని నిర్మించనున్నారు.
నిర్మాణ సమయం:
ఆలయ నిర్మాణ కమిటీ చేర్మన్ న్రిపింద్ర మిశ్ర సమాచారానుసారం, మూడంతస్తుల నిర్మాణంలో సాగుతున్న ఈ మందిరం ఈ ఏడాది డిసెంబర్‌లో పూర్తి కానుంది.
బహుమానాలు:
శ్రీరామునికి దేశనలుమూలలనుంచి వచ్చే భక్తులంతా ఆయనకు అనేక రకాల బహుమానాలను తయారు చేయించి, చేసి మందిరానికి అందజేశారు. ఎంతోమంది జనాలు ఎన్నో రకాలుగా వారి భక్తిని చూపుతున్నారు.