Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
Sakshi Education
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 18న (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి.
Ayodhya Ram Mandir Inauguration Updates 2024 : కేంద్రం కీలక ప్రకటన.. అన్ని కార్యాలయాలకు హాలీడే.. కానీ..
రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి.
ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి.
Published date : 19 Jan 2024 03:01PM