Skip to main content

Ayodhya Ram Temple : జనవరి 14న అయోధ్య రామాలయ ప్రతిష్టాపన

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం చకచకా సాగుతోంది.
Ayodhya Ram Temple

వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి రోజు ఆలయ ప్రతిష్టాపన జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా చెప్పారు. ప్రతిష్టాపన వేడుకలు 10 రోజులపాటు కొనసాగుతాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ వేడుకలను దేశ విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కనీసం వెయ్యి సంవత్సరాలపాటు పటిష్టంగా ఉండేలా రామాలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.  

Ayodhya: ‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి.. వివరాలు వెల్లడించిన ట్రస్ట్‌

  •  
Published date : 21 Jun 2023 11:46AM

Photo Stories