Skip to main content

Maharashrta: థాక్రేకి షాక్‌... పార్టీతో పాటు గుర్తు పాయే... 8 నెల‌ల ఉత్కంఠ‌కు తెర‌.!

మహారాష్ట్ర రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్‌నాథ్‌ షిండే వర్గానికే సిసలైన శివసేన గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పార్టీ విల్లు-బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
Eknath Shinde

దీంతో మహారాష్ట్రలో ఎనిమిది నెలల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. ఈ ప‌రిణామం మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవ‌చ్చు. బాలాసాహెబ్‌ ఠాక్రే నేతృత్వంలో 1966లో ఆవిర్భవించిన శివసేనపై ఠాక్రే కుటుంబం నియంత్రణ కోల్పోవడం ఇదే తొలిసారి.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు ఓటు వేసిన వారిలో 76 శాతం మంది శిందే వర్గంలోని ఎమ్మెల్యేలకు మద్దతు తెలిపారని, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలోని ఎమ్మెల్యేలకు 23.5శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని పేర్కొంటూ ఈసీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

చ‌ద‌వండి: ఇండియాకు చేరుకున్న చీతాలు

ఈసీ తాజా నిర్ణయంతో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని వర్గానికి....శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పేరు, దానికి కేటాయించిన కాగడా గుర్తు యథాతథంగా ఉంటాయి. గత ఏడాది అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈసీ వీటిని కేటాయించింది. అదే సమయంలో ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి ‘బాలాసాహెబంచి శివసేన’ పేరును, రెండు కత్తులు, డాలు గుర్తును కేటాయించింది. అయితే, తాజా నిర్ణయంతో అసలు శివసేన, ఆ పార్టీ అధికారిక గుర్తు అయిన ‘విల్లు-బాణం’ గుర్తు శిందే నేతృత్వంలోని వర్గం సొంతమవుతాయి.

చ‌ద‌వండి: ఇండియానూ తాకిన లేఆఫ్స్‌... వందల మందిని తొలగించిన గూగుల్‌ 

మహా వికాస్‌ అఘాడి కూటమి(శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఇతరులు)ని వ్యతిరేకిస్తూ.. 2022 జూన్‌లో కొందరు ఎమ్మెల్యేలతో క‌లిసి ఏక్‌నాథ్ షిండే.. శివసేన నుంచి బయటకు వచ్చేశారు. ఆపై రెబల్స్‌ను పలు ప్రాంతాలకు తిప్పుతూ.. చివరకు బీజేపీ సాయంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

Published date : 18 Feb 2023 01:47PM

Photo Stories