Turkey Earthquake: భూకంప ప్రమాదంలో ప్రముఖ గోల్ కీపర్ మృతి
Sakshi Education
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం దాటికి వేలాది మంది మృత్యువాత పడ్డారు. సోమవారం(ఫిబ్రవరి 6) సంభవించిన భూప్రకంపనల్లో వందలాది భవనాలు కుప్పకూలగా.. వాటి శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు.
ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే టర్కీకి చెందిన 28 ఏళ్ల ఫుట్‌బాలర్.. గోల్‌కీపర్ అహ్మత్ ఎయుప్ తుర్క్‌స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న ఎయుప్ కన్నుమూసినట్లు యేని మాలత్యస్పోర్ ఫుట్‌బాల్ క్లబ్ తన ట్విటర్‌లో ధృవీకరించింది.
Published date : 09 Feb 2023 04:15PM