Skip to main content

BBC Documentary: మరోసారి తన వంకరబుద్ధి చూపించిన అమెరికా... మోదీపై పరోక్ష సెటైర్లు

గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై జాతీయంగా, అంతర్జాతీయంగా పెనుదుమారం రేగుతోంది.

ఉద్దేశపూర్వకంగా డాక్యుమెంటరీ చిత్రీకరణ సాగిందని బీజేపీ ఆరోపిస్తూ ఉంటే.. అందులో నిజాలే చూపించారని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఈ విషయంలో అమెరికా తన వంకర బుద్ధిని మరోసారి చూపించింది. 
గతవారమే బ్లాక్‌....
ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీని ఇటీవల విడుదల చేసింది. ఇది దురుద్దేశపూర్వకంగా ఉందని కేంద్రం ఈ వీడియోలను బ్యాన్‌ చేసింది. గతవారమే ట్విట్టర్, యూట్యూబ్‌లలో వీడియో లింక్స్‌ను బ్లాక్‌ చేసేసింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తాజాగా దీనిపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికా స్వేచ్ఛకు తాము మద్దతు ఇస్తామని, ప్రాజాస్వామ్య విలువలను భావప్రకటనా స్వేచ్ఛ, మతం మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. భారత్‌కు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.

Modi Biden

చ‌ద‌వండి: అదరగొట్టిన ఏపీ విద్యార్థి... ఇంటెల్‌లో 1.2 కోట్ల ప్యాకేజీతో జాబ్‌
మూడు రోజులకే యూటర్న్‌...
సోమవారం ఇదే విషయంపై మాట్లాడిన ప్రైస్‌.. మోదీపై బీబీసీ రూపొందించన డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని, భారత్‌–అమెరికా బంధం ప్రత్యేకమని వ్యాఖ్యానించారు. రెండు దేశాల ప్రజాస్వామ్య విలువలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. భారత్‌లో జరిగిన విషయాల గురించి గతంలోనే తాము మాట్లాడినట్లు పేర్కొన్నారు. కానీ ఒక్కరోజులోనే యూ టర్న్‌ తీసుకుని బీబీసీ డాక్యుమెంటరీని భారత్‌లో నిషేధించడాన్ని పరోక్షంగా తప్పుబట్టారు.

చ‌ద‌వండి:​​​​​​​ కీర‌వాణికి ప‌ద్మ‌శ్రీ... ప‌ద్మ అవార్డుల ప్ర‌క‌ట‌న‌
వెయ్యి మందికి పైగా మృతి...
2002లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. కరసేవకులు ప్రయాణించిన రైలుకు దుండగులు నిప్పుపెట్టిన ఘటనలో 50 మందికిపైగా చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో హింస మొదలైంది. ఈ ఘర్షణల్లో 1000 మందికిపైగా చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం మోదీకి 2012లోనే క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

Published date : 26 Jan 2023 01:37PM

Photo Stories