Skip to main content

NEET Result 2021: నీట్‌ పరీక్షా ఫలితాలు విడుదల

NEET

నీట్‌–2021 పరీక్షా ఫలితాలు నవంబర్‌ 1వ తేదీన వెల్లడయ్యాయి. అభ్యర్థులకు ఈ–మెయిల్‌ ద్వారా ఫలితాలను పంపించినట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్, ఆయుష్‌ విభాగాల్లో ప్రవేశాల కోసం 2021, సెప్టెంబర్‌ 12వ తేదీన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నీట్‌–2021 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్ష నిర్వహించాక నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది పలు కారణాల వల్ల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.

Must Check: State-wise NEET MBBS and BDS Cut-off Ranks

Published date : 01 Nov 2021 07:37PM

Photo Stories