వీశాట్–2022 నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో డిసెంబర్ 13న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీసీతోపాటు వర్సిటీ ఇన్ చార్జి రిజి్రస్టార్ డాక్టర్ పీఎంవీ రావు, డీన్ డి.విజయకృష్ట, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ.గౌరీశంకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2022–2023కు సంబంధించిన బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తాము దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు (వీశాట్) నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఇందులో భాగంగా వీశాట్–2022 నోటిఫికేషన్ ను విడుదల చేశామని, దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, విశాఖ, ఏలూరు, రాజమండ్రిలలోని విజ్ఞాన్ సంస్థల కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దరఖాస్తులు ఏప్రిల్ 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. వీశాట్‌లో తొలి 100లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 101 నుంచి 200లోపు ర్యాంక్ సాధించిన వారికి 50 శాతం, 201 నుంచి 400లోపు ర్యాంకు సాధించిన వారికి 25 శాతం, 401 నుంచి 2,000లోపు ర్యాంకు సాధించిన వారికి 10 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ స్కోర్, జేఈఈ మెయిన్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానూ ఫీజు రాయితీ ఉంటుందన్నారు.
చదవండి:
Department of Medical and Health: పీజీ ఇన్ సర్వీస్ కోటా పునరుద్ధరణ
Acharya Nagarjuna University: ఏఎన్ యూతో బ్రిటీష్ కౌన్సిల్ ఎంవోయూ